పుష్పతో బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్.... ఆస్కార్ ను ముద్దాడే వరకు అస్సలు తగ్గేదే లే అంటున్నాడు. ఆ దిశగా తన ప్లానింగ్ ను సెట్ చేసుకుంటున్నాడు బన్నీ. ఇందుకోసం హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థలు, అక్కడి నటీనటులతో ఇప్పటి నుంచే సంబంధాలు పెంచుకుంటున్నాడట. తన రాబోయే మూవీస్ లో యాక్టర్స్ తోపాటు ఎంచుకునే కథల విషయంలోనూ ప్రపంచ స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.