- Telugu News Photo Gallery Cinema photos Tamannaah Bhatia Shocking Comments on Telugu Movies Heroines Telugu Actress Photos
Tamannaah Bhatia: సౌత్ సినిమాల హీరో ఎలివేషన్స్ పై తమన్నా షాకింగ్ కామెంట్స్..
తమన్నా సౌత్ ఇండియా సినిమాల మీద చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.. సౌత్ సినిమాల్లో హీరోయిజం గురించి , సౌత్ సినిమాలు ఫాలో అయ్యే ఫార్ములాల గురించి ఓపెన్ అయ్యారు తమన్నా. ఇనేళ్ళుగా సౌత్ ఇండస్ట్రీ లో ఉన్న ఆమె చేసిన కామెంట్స్ విని పలువురు వాట్ ఈజ్ ఠిస్ తమన్నా అంటున్నారు.. జైలర్ మూవీ టైం లో తెలుగులో ఎక్కువ ప్రమోషన్ లేకపోయినా 'వా నువ్వు కావాలయ్యా' సాంగ్ క్లిక్ అవ్వడంతో ఆ కొరత కనిపించలేదు.. అంతగా పాపులర్ అయ్యింది ఆ పాట.
Updated on: Oct 20, 2023 | 8:35 AM

తమన్నా సౌత్ ఇండియా సినిమాల మీద చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.. సౌత్ సినిమాల్లో హీరోయిజం గురించి , సౌత్ సినిమాలు ఫాలో అయ్యే ఫార్ములాల గురించి ఓపెన్ అయ్యారు తమన్నా.

ఇనేళ్ళుగా సౌత్ ఇండస్ట్రీ లో ఉన్న ఆమె చేసిన కామెంట్స్ విని పలువురు వాట్ ఈజ్ ఠిస్ తమన్నా అంటున్నారు.. జైలర్ మూవీ టైం లో తెలుగులో ఎక్కువ ప్రమోషన్ లేకపోయినా 'వా నువ్వు కావాలయ్యా' సాంగ్ క్లిక్ అవ్వడంతో ఆ కొరత కనిపించలేదు.. అంతగా పాపులర్ అయ్యింది ఆ పాట.

జైలర్ సినిమాలో తమన్నా క్యారెక్టర్ కి పెద్దగా స్కోప్ లేకపోయినా ఆ ఒక్క సాంగ్ తోనే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు తమన్నా. జైలర్ తో పాటు ఆమె నటించిన భోళా శంకర్ కూడా విడుదల అయ్యింది. ఈ సినిమాలో తమన్నా క్యారెక్టర్ కి కాస్త ఇంపార్టెన్స్ ఉంది.

అయితే లేటెస్ట్ గా తమన్నా సౌత్ సినిమాల మీద స్ట్రాంగ్ కామెంట్స్ పాస్ చేసారు. దక్షిణాదిన హీరోయిజాన్ని ఎలివేట్ చేసే తీరు కొన్ని సార్లు భరించలేకపోతున్నం అని చెప్పారు.

కొన్ని చిత్రాల్లో తన క్యారెక్టర్ కి అర్ధం పర్ధం ఉండేది కాదని ఆ విషయాన్ని తాను ఫిలిం మేకర్స్ దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదని అన్నారు.ప్రస్తుతం అలాంటి పాత్రలకు నిక్కచ్చిగా నో చెప్పేస్తున్నా అన్నారు ఈ మిల్కీ బ్యూటీ..

లస్ట్ స్టోరీస్ తో నార్త్ లో క్లిక్ అయినా తమన్నా ఇన్ని మాటలు మాట్లాడింది ఎవరి గురించి..? అని ఆరా తెస్తున్నారు నెటిజన్లు.

మరోవైపు తాను చేసిన హిందీ సినిమాల ఫెయిల్యూర్ ని పర్సనల్ ఫెయిల్యూర్ గా తీసుకోవడం లేదని అన్నారు తమన్నా. ఆ సినిమాల ఫెట్ అంతేనని ఫ్యూచర్ లో జబర్దస్త్ ప్రాజెక్ట్స్ చేస్తానని చెప్పారు తమన్నా.




