
ఇప్పుడు మన సినిమా మేకర్స్ సినిమాకు ఇంటర్నేషనల్ రేంజ్ తీసుకొచ్చే విషయం గురించి చాలా చాలానే ఆలోచిస్తున్నారు. ఆచరణలో పెట్టడానికి తమవంతు కృషి చేస్తున్నారు. దీని కోసం బాగా కష్టపడుతున్నారు.

అల్లు అర్జున్ - అట్లీ సినిమా అనౌన్స్ మెంట్ వీడియో చూసి ఫిదా అయిపోయారు మూవీ లవర్స్. కచ్చితంగా కొత్తగా ఉంటుందని అనుకున్నాం కానీ, ఇంత భారీగా ఉంటుందని ఊహించలేకపోయామని వండర్ అయ్యారు. మూవీని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లడం కోసం వారు కలిసిన టెక్నీషియన్లను చూసి వారెవా అంటున్నారు..

తారక్ ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో ఖుషీగానే ఉన్నారు. దేవర సీక్వెల్ స్టార్ట్ కావడానికన్నా ముందే వీఎఫ్ఎక్స్ పనులు స్టార్ట్ అయ్యాయన్నది వారి ఆనందానికి రీజన్. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ అవుతుంది.

ఆల్రెడీ కన్నప్ప వర్క్ అంతా ఫారిన్‌లోనే జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ రుద్రగా నందీశ్వరుడు పాత్రలో నటించడంతో దీనికి హైప్ బాగా పెరిగిపోయింది. అందుకే దీని ఇంటర్నేషనల్ ఫేమ్ వచ్చింది.

ఎస్ఎస్ఎంబీ29 కోసం జాపనీస్ గేమ్ డిజైనర్ హిడియో కొజిమాతో టచ్‌లో ఉన్నారు రాజమౌళి అండ్ కార్తికేయ. 'బియాండ్ ఎగ్జయిటెడ్ ఫర్ దిస్' అంటూ కార్తికేయ పోస్టు పెట్టినప్పటి నుంచి అదేంటని ఆరా తీసే పనిలో పడిపోయారు ఘట్టమనేని అభిమానులు.