నందమూరి నట సింహం బాలయ్యని ఓవర్‌నైట్‌లో గాడ్ ఆఫ్ మాసెస్‌గా పిలిచేలా చేసిన సినిమా వీరసింహారెడ్డి. ఓపెనింగ్స్ డివైడ్ టాక్‌తో స్టార్ట్ అయినప్పటికీ, మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా వీరసింహారెడ్డి. చెల్లెలి సెంటిమెంట్, బాలయ్య చేసిన డ్యూయల్ రోల్స్, పవర్‌ఫుల్ పంచెస్, మాస్ ఎలివేషన్స్ సినిమాను ఆ రేంజ్ సక్సెస్ తెచ్చిపెట్టాయి. అదే సీజన్‌లో వాల్తేరు వీరయ్యలో తమ్ముడిగా హిట్ కొట్టారు రవితేజ. దసరాకు అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావుతో బరిలోకి దిగుతున్నారు.