క్లిక్ అయిన సినిమాలో స్క్రీన్ మీద ఒక్కరే కనిపిస్తే, ఆ క్రెడిట్ ఇచ్చే కిక్కే వేరు. సక్సెస్ పార్టీల్లో చెలరేగిపోవచ్చు. అయితే కొన్ని సార్లు, కథ డిమాండ్‌ని బట్టి, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ చేయాల్సి ఉంటుంది. అలా చేయాల్సిన ప్రతిసారీ హాయిగా, హ్యాపీగా ముందుకొస్తున్నారు ప్రియమణి. రీసెంట్‌గా జవాన్ సినిమాలో అంత మంది అమ్మాయిల మధ్య కీ రోల్ చేశారు. ఇప్పుడు భామాకలాపం2లోనూ, ప్రియమణితో శరణ్య కనిపిస్తూనే ఉంటారు.