- Telugu News Photo Gallery Cinema photos Sridevi Second Daughter Khushi Kapoor entry With Telugu Uppena Movie Remake Telugu Actress Photos
Khushi Kapoor: తెలుగు రీమేక్‌తో శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ ఎంట్రీ.!
మన దగ్గర దుమ్ము లేపుతున్న సినిమాలు బాలీవుడ్‌కు వెళ్లేసరికి ఎందుకు తోక ముడుస్తున్నాయి..? సమస్య మన కథల్లో ఉందా లేదంటే వాళ్లు తీసే విధానంలో ఉందా..? తాజాగా మరో టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ బాలీవుడ్‌లో రీమేక్ కాబోతుంది. అది కూడా మామూలు కథ కాదు.. రిస్కీ కథే. మరింతకీ ఏంటా సినిమా..? అదైనా అక్కడ వర్కవుట్ అవుతుందా.? తెలుగు ఇండస్ట్రీలో అప్పుడప్పుడూ కొన్ని సినిమాలు అలా ట్రెండ్ సెట్ చేస్తుంటాయి.
Updated on: Mar 24, 2024 | 2:41 PM

మన దగ్గర దుమ్ము లేపుతున్న సినిమాలు బాలీవుడ్‌కు వెళ్లేసరికి ఎందుకు తోక ముడుస్తున్నాయి..? సమస్య మన కథల్లో ఉందా లేదంటే వాళ్లు తీసే విధానంలో ఉందా..? తాజాగా మరో టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ బాలీవుడ్‌లో రీమేక్ కాబోతుంది. అది కూడా మామూలు కథ కాదు.. రిస్కీ కథే. మరింతకీ ఏంటా సినిమా..? అదైనా అక్కడ వర్కవుట్ అవుతుందా.?

తెలుగు ఇండస్ట్రీలో అప్పుడప్పుడూ కొన్ని సినిమాలు అలా ట్రెండ్ సెట్ చేస్తుంటాయి. అప్పట్లో శివ.. ఆ తర్వాత చిత్రం.. మొన్నామధ్య అర్జున్ రెడ్డి.. మూడేళ్ళ కింద ఉప్పెన.. లాస్ట్ ఇయర్ బేబీ.. ఈ మధ్యే హనుమాన్..! రిలీజ్‌కి ముందు ఏ సందడి ఉండదు.. కానీ అవి వచ్చాక చేసే సందడి ముందు ఇంకేం వినిపించదు.

వీటిలో ఇప్పుడు మనం మాట్లాడుకునే సినిమా ఉప్పెన. వైష్ణవ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన 100 కోట్లకు పైగా వసూలు చేసింది. 2021లో కరోనా పీక్స్‌లో ఉన్న సమయంలో ఇండస్ట్రీని బతికించిన సినిమా ఇది.

ఇప్పుడు ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాతో శ్రీదేవి చిన్నకూతురు ఖుషీ కపూర్‌ను పరిచయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉప్పెన రీమేక్‌కు హీరో, దర్శకుడు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అయితే ఈ కథ అనుకున్నంత ఈజీ అయితే కాదు.. ఏ మాత్రం తేడా కొట్టినా అంతే సంగతులు.

అలాగే బేబీ కూడా హిందీలో రీమేక్ అవుతుంది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య జంటగా సాయి రాజేష్ తెరకెక్కించిన బేబీ 90 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. హిందీలో దీనికి కల్ట్ బొమ్మ అనే టైటిల్ రిజిస్టర్ చేసారు.

ఈ మధ్య తెలుగు రీమేక్స్ హిందీలో వర్కవుట్ అవ్వట్లేదు. జెర్సీ, అల వైకుంఠపురములో, హిట్ లాంటి సినిమాలు మన దగ్గర బాగానే ఆడినా.. బాలీవుడ్‌లో ఫ్లాపయ్యాయి.

అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ ఒక్కటే ఈ మధ్య హిట్టైన తెలుగు రీమేక్. మరి ఇదే కోవలో బేబీ, ఉప్పెన రీమేక్స్ నిలుస్తాయా..? ఏదేమైనా నార్త్ ఆడియన్స్‌కు నచ్చేలా ఈ రీమేక్స్ రూపొందించడం పెద్ద టాస్కే.




