- Telugu News Photo Gallery Cinema photos Heroine Rashmika Mandanna Will say Goodbye to South Industry After Animal Movie Success Telugu Actress Photos
Rashmika Mandanna: యానిమల్ తర్వాత సౌత్ ఇండస్ట్రీకి రష్మిక బైబై.? వీడియో.
టాలీవుడ్‌కు రష్మిక మందన్న టాటా చెప్తున్నారా.? సౌత్‌కు బైబై చెప్పి బాలీవుడ్‌లో సెటిల్ అవ్వాలని చూస్తున్నారా..? స్టార్ హీరోలు వేచి చూస్తున్నా.. నిర్మాతలు క్యూ కడుతున్నా.. అమ్మడి చూపు మాత్రం ముంబై మీదే ఉందా.? పుష్ప 2 తర్వాత రష్మిక ప్లానింగ్ ఏంటి.? తెలుగులో ఇంకేమైనా సినిమాలు ఒప్పుకుంటారా..? యానిమల్ ముందు వరకు రష్మిక మందన్న కెరీర్ అంతంత మాత్రంగానే ఉంది.
Updated on: Mar 24, 2024 | 2:42 PM

టాలీవుడ్‌కు రష్మిక మందన్న టాటా చెప్తున్నారా.? సౌత్‌కు బైబై చెప్పి బాలీవుడ్‌లో సెటిల్ అవ్వాలని చూస్తున్నారా..? స్టార్ హీరోలు వేచి చూస్తున్నా.. నిర్మాతలు క్యూ కడుతున్నా.. అమ్మడి చూపు మాత్రం ముంబై మీదే ఉందా.?

పుష్ప 2 తర్వాత రష్మిక ప్లానింగ్ ఏంటి.? తెలుగులో ఇంకేమైనా సినిమాలు ఒప్పుకుంటారా..? యానిమల్ ముందు వరకు రష్మిక మందన్న కెరీర్ అంతంతమాత్రంగానే ఉంది.

బాలీవుడ్‌లో చేసిన రెండు సినిమాలు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. కానీ యానిమల్‌తో అమ్మడి రేంజ్ మారిపోయింది. దెబ్బకు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు.

యానిమల్ సక్సెస్‌తో అసలైన పాన్ ఇండియన్ హీరోయిన్‌గా మారిపోయారు ఈ బ్యూటీ. సౌత్ సినిమాకు దూరంగా ఉండి.. బాలీవుడ్‌లో బిజీ అవ్వాలని చూస్తున్నారు రష్మిక.

అందుకే పుష్ప 2తో పాటు మరో నాలుగు సినిమాలు చేస్తున్నా.. ఏ ఒక్కటి రీజినల్ సినిమా లేదు.. అన్నీ పాన్ ఇండియన్ లేదంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాలే. గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తున్నారు రష్మిక మందన్న.

యానిమల్ తర్వాత బాలీవుడ్‌లో రష్మిక కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. రెమ్యునరేషన్‌కు కూడా రెక్కలొచ్చేసాయి. ప్రస్తుతం ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో వస్తున్న కుబేరలోనూ నటిస్తున్నారు.

ఇది కూడా కేవలం పాన్ ఇండియా సినిమానే. మొత్తానికి అయితే పాన్ ఇండియా లేదంటే బాలీవుడ్ అంటూ రీజినల్ సినిమాలకు బైబై చెప్తున్నారు రష్మిక.




