AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: 2025 మొత్తం నాదే అంటున్న శ్రీలీల.. అదే ఊపు.. అదే జోరు.. తగ్గేదేలే

చదువుకోవాలని కదా అని చిన్న గ్యాప్ ఇచ్చా..! ఎంబిబిఎస్ ఎగ్జామ్స్ కోసం కొన్నాళ్లు సినిమాలను తీసి పక్కనబెట్టా..! అంత మాత్రానికే రేసులో లేననుకున్నారా.. సీన్ అయిపోయిందనుకున్నారా..? అదే ఊపు.. అదే జోరు..! రేసు మొదలుపెడితే నన్నందుకోలేరు అంటున్నారు శ్రీలీల. మరి ఈమె కాన్ఫిడెన్స్‌కు కారణమేంటో సరదాగా అలా తెలుసుకుని వచ్చేద్దాం పదండి..!

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Mar 17, 2025 | 8:19 PM

Share
ఏడాది మొదట్లో మహేష్ బాబుతో కలిసి కుర్చీ మడతబెట్టడం.. చివర్లో బన్నీతో కలిసి కిస్ కిసిక్ అంటూ స్టెప్పులేయడం మినహాయిస్తే 2024 శ్రీలీలకు పెద్దగా తీసుకొచ్చిందేమీ లేదు.

1 / 5
సినిమాలను కాస్త పక్కనబెట్టి.. చదువులపై ఫోకస్ చేసారు ఈ భామ. ఎంబిబిఎస్ ఎగ్జామ్స్ కోసం 2024లో చాలా తక్కువ సినిమాలు సైన్ చేసారు శ్రీలీల. ఆ బాకీ అంతా ఇప్పుడు తీర్చుకుంటున్నారు.

2 / 5
శ్రీలీల జోరు తగ్గేసరికి.. ఈమె రేసు నుంచి తప్పుకుందనే అనుకున్నారంతా. కానీ చిన్న గ్యాప్ ఇచ్చారని ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే 2025 అంతా ఈ భామ హవావే కనిపించబోతుంది. ఒకటి రెండూ కాదు.. ఏకంగా 6 సినిమాలతో వస్తున్నారీమే.

3 / 5
అందులో ముందుగా నితిన్ రాబిన్ హుడ్ మార్చి 28న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్‌తోనే బిజీగా ఉన్నారు శ్రీలీల. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజ మాస్ జాతరతో పాటు నాగ చైతన్య , కార్తిక్ దండు సినిమాలోనూ శ్రీలీలనే హీరోయిన్‌గా తీసుకున్నారు.

4 / 5
ఇక అఖిల్ కొత్త సినిమాలోనూ ఈమె హీరోయిన్. తమిళంలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న పరాశక్తితో కోలీవుడ్‌కు.. కార్తిక్ ఆర్యన్ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు శ్రీలీల. మొత్తానికి కాస్త గ్యాప్ ఇచ్చినా.. గ్యాప్ లేకుండా సినిమాలకు రప్ఫాడిస్తున్నారు శ్రీలీల.

5 / 5
Follow Us