- Telugu News Photo Gallery Cinema photos Sandeep reddy vanga Prabhas's Spirit Movie Update on 17 03 2025
Spirit: ప్రభాస్‌కు కండీషన్స్ సందీప్ రెడ్డి వంగా.. సరికొత్తగా ప్లాన్ చేస్తున్న దర్శకుడు
నేను మీకు బాగా కావాల్సిన వాడిని..! ఈ టైటిల్ కాస్త కంగారు పడి కిరణ్ అబ్బవరం సినిమాకు పెట్టారు కానీ.. దీనికి పర్ఫెక్ట్ హీరో ప్రభాస్ ఒక్కడే. ముఖ్యంగా దర్శకులకు ఆయనిస్తున్న ఆఫర్స్ చూసాక అభిమానులు కూడా ఇదే అంటున్నారు. తాజాగా దీన్నే క్యాష్ చేసుకోడానికి రెడీ అవుతున్నారు సందీప్ రెడ్డి వంగా. మరి ఆయనేం చేయబోతున్నారు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..
Updated on: Mar 17, 2025 | 8:27 PM

ప్రభాస్‌లోని నటుడిని ఒక్కో దర్శకుడు ఒక్కోలా వాడుకుంటున్నారు. ఒకేసారి మూడు నాలుగు సినిమాలు కమిటైనా.. ఏ ఒక్క సినిమాకు మరోదానితో సంబంధం లేకుండా చూసుకుంటున్నారు రెబల్ స్టార్.

ఆ మధ్య ఆదిపురుష్ డివోషనల్ అయితే.. సలార్ పూర్తిగా మాస్.. దానికి ముందొచ్చిన రాధే శ్యామ్ లవ్ స్టోరీ.. సాహో పక్కా యాక్షన్ బొమ్మ.. కల్కి ఫిక్షనల్ కథ.. ఇలా ప్రతీదీ దేనికదే విభిన్నం.

ప్రభాస్ ప్రస్తుతం మారుతి రాజా సాబ్‌తో పాటు హను రాఘవపూడితో ఫౌజీ సినిమాలు చేస్తున్నారు. ఇందులో రాజా సాబ్ హార్రర్ కామెడీ అయితే.. ఫౌజీ ఎమోషనల్ పీరియడ్ డ్రామా. ఇందులో ప్రేమకథ బలంగా ఉండబోతుంది. పైగా హను రాఘవపూడి స్ట్రెంత్ కూడా అంతే. వీటి తర్వాత సలార్ 2, కల్కి 2 క్యూలో ఉన్నాయి.. వీటి జోనర్స్ గురించి చెప్పనక్కర్లేదు.

ఈ గ్యాప్‌లో సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమా కూడా చేయనున్నారు ప్రభాస్. ఈ ప్రాజెక్ట్ కోసం పూర్తిగా మారిపోనున్నారు ప్రభాస్. ఇంకా చెప్పాలంటే నాకు పాత ప్రభాస్ వద్దు.. పూర్తిగా కొత్తగా కావాలని దర్శకుడే కండీషన్స్ పెడుతున్నారు. బేసిక్‌గానే తన సినిమాల్లో హీరో కారెక్టరైజేషన్‌ను కొత్తగా డిజైన్ చేసే సందీప్.. ప్రభాస్ కోసం మరింత క్రేజీగా ప్లాన్ చేస్తున్నారు.

స్పిరిట్‌లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నారు ప్రభాస్. యానిమల్‌లో తండ్రీ కొడుకుల ప్రేమను కొత్తగా చూపించిన సందీప్.. స్పిరిట్‌లో ఇండియన్ సినిమా ఇప్పటి వరకు చూడని సరికొత్త కాప్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ కోసం యూనిక్ కారెక్టరైజేషన్ డిజైన్ చేస్తున్నారు సందీప్. 2025 సెకండాఫ్‌లో స్పిరిట్ షూటింగ్ మొదలు కానుంది.




