- Telugu News Photo Gallery Cinema photos Sreeleela Shares beautiful pink dress photos goes viral telugu movie news
Sreeleela : నెమ్మదించినా మంచికే అంటున్న శ్రీలీల.. ఆ సూపర్ హిట్ రిజెక్ట్ చేసిన హీరోయిన్.
టాలీవుడ్ ఇండస్ట్రీలో గతేడాది సునామీ సృష్టించింది శ్రీలీల. ఒకేరోజు దాదాపు అరడజనుకుపైగా చిత్రాలను అనౌన్స్ చేసి సెస్సెషన్ అయ్యింది. 2023 పూర్తిగా శ్రీలీల నామ సంవత్సరంగానే సాగింది. ధమాకా మూవీతో భారీ విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత మాత్రం వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్లకు చెమటలు పట్టించింది. అవకాశాలన్ని అందుకుని టాప్ హీరోయిన్గా దూసుకుపోయింది.
Updated on: Apr 05, 2024 | 9:41 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో గతేడాది సునామీ సృష్టించింది శ్రీలీల. ఒకేరోజు దాదాపు అరడజనుకుపైగా చిత్రాలను అనౌన్స్ చేసి సెస్సెషన్ అయ్యింది. 2023 పూర్తిగా శ్రీలీల నామ సంవత్సరంగానే సాగింది.

ధమాకా మూవీతో భారీ విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత మాత్రం వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్లకు చెమటలు పట్టించింది. అవకాశాలన్ని అందుకుని టాప్ హీరోయిన్గా దూసుకుపోయింది.

కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ వచ్చింది. వరుస హిట్స్ అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఖాతాలో డిజాస్టర్స్ వచ్చి పడ్డాయి. ఆదికేశవ, ఎక్స్ఆర్డీనరీ మ్యాన్ చిత్రాలు ఈ బ్యూటీకి నిరాశను మిగిల్చాయి. దీంతో మూవీ కంటెంట్ పై ఫోకస్ పెట్టింది.

చివరగా గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇప్పుడు మూవీ కంటెంట్, పాత్ర ప్రాధాన్యత పై దృష్టి పెట్టింది. నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టిల్లు స్క్వేర్ సినిమాకు కూడా ఈ బ్యూటీ నో చెప్పిందట.

నిజానికి టిల్లు స్క్వేర్ సినిమాకు అనుపమ కంటే ముందు శ్రీలీలను అనుకున్నారట. అప్పటికే కొన్ని సీన్స్ కూడా తీశారని.. కానీ గ్లామర్ షో.. లిప్ లాక్ సీన్స్ ఉండడంతో మధ్యలోనే డ్రాప్ అయ్యిందని టాక్ నడిచింది. కట్ చేస్తే ఆమె స్థానంలోకి అనుపమ వచ్చింది.




