
టాలీవుడ్‌లో కేరాఫ్ మాస్ సాంగ్స్‌గా మారిపోతున్నారు శ్రీలీల. డాన్సులు కుమ్మేస్తారు కాబట్టి మరో ఆలోచన లేకుండా ఈమెతో మతిపోయే మాస్ సాంగ్ సినిమాకు కనీసం ఒక్కటైనా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

సినిమా హిట్ ఫ్లాప్ తర్వాత.. ముందు ఆ పాటైతే ఫుల్లు వైరల్ అయిపోతుంది. తాజాగా వైరల్ అనే పేరు మీదే పాట చేసారు దేవీ శ్రీ ప్రసాద్ అండ్ శ్రీలీల. గాలి కిరిటీ హీరోగా పరిచయం అవుతున్న జూనియర్ సినిమాకు దేవీ సంగీతం అందిస్తున్నారు.

ఇందులో అదిరిపోయే మాస్ బీట్ ఇచ్చారు DSP. సోషల్ మీడియా నేపథ్యంలో సాగే ఈ పాటలో అదిరిపోయే మాస్ స్టెప్పులేసారు శ్రీలీల.

గతంలోనూ దేవీతో కలిసి కిసిక్ అనే ఖతర్నాక్ సాంగ్ చేసారు ఈ బ్యూటీ. ఇక తమన్ మ్యూజిక్‌లో ఈమె చేసిన కుర్చీ మడతబెట్టి యూ ట్యూబ్‌ను షేక్ చేసింది. ధమాకా నుంచి శ్రీలీలతో మాస్ సాంగ్స్ చేయిస్తున్నారు దర్శకులు.

అందులో జింతాక్ జింతాక్.. స్కందలో గండరబాయ్.. ఆదికేశవలో లీలమ్మో.. గుంటూరు కారంలో కుర్చీ మడతబెట్టి ఇలా ప్రతీ సినిమాలోనూ మాస్ సాంగ్స్‌లో రప్ఫాడిస్తున్నారు శ్రీలీల. మాస్ జాతరలోనూ తూ మేరీ లవర్ అంటూ కేక పెట్టించారు ఈ బ్యూటీ. తాజాగా వైరల్ వయ్యారి అంటూ వచ్చేస్తున్నారు.