Siva Karthikeyan: టాలీవుడ్‌పై కోలీవుడ్ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు.. అలా ఎలా..

Edited By: Phani CH

Updated on: Sep 02, 2025 | 8:03 PM

మన గురించి మనమే గొప్పగా చెప్పుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి..? బయటి ఇండస్ట్రీ నుంచి ఒకరొచ్చి.. మీరు తోపుల్రా సామీ అన్నపుడే కదా అసలు కిక్కు. తాజాగా ఓ హీరో కామెంట్స్ విన్నాక.. తెలుగు సినిమా ఫ్యాన్స్ ఇలాగే కాలర్ ఎగరేస్తున్నారు. మరి అంతగా కిక్ ఇచ్చిన ఆ కామెంట్స్ ఏంటి..? ఆ కామెంట్ చేసిన హీరో ఎవరు..?

1 / 5
ఒకప్పుడు తెలుగు సినిమాలకు 1000 కోట్లు అంటే కల.. కానీ దాన్ని రాజమౌళి చాలా సింపుల్ చేసారు. బాహుబలి 2 తర్వాత ట్రిపుల్ ఆర్, పుష్ప 2 సినిమాలు 1000 కోట్లు క్రాస్ చేసాయి.

2 / 5
మనోళ్లను చూసి కన్నడలో కేజియఫ్ 2.. హిందీలో పఠాన్, జవాన్ కూడా 1000 కోట్లు కలెక్ట్ చేసాయి. కానీ తమిళ ఇండస్ట్రీకి ఇది సాధ్యం కాలేదు.. దీనిపైనే శివకార్తికేయన్ ఆసక్తికర కామెంట్స్ చేసారు.

3 / 5
సెప్టెంబర్ 5న మదరాసి సినిమాతో రాబోతున్నారు శివకార్తికేయన్. మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ.. తెలుగు సినిమాల్లో కంటెంట్ అదిరిపోతుంది కాబట్టి 1000 కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి.. అదే టాలీవుడ్ సీక్రేట్ అన్నారు.

4 / 5

అయితే మురుగదాస్ మాత్రం ఆ మధ్య 1000 కోట్ల సినిమాలపై చేసిన కామెంట్స్ బాగా నెగిటివ్ అయ్యాయి. తమిళ దర్శకులు ఎడ్యుకేట్ చేస్తారని.. 1000 కోట్ల సినిమాలు ఎంటర్‌టైన్మెంట్ ఇస్తాయన్నారు మురుగదాస్.

5 / 5
ఈయన కామెంట్స్ వైరల్ అయ్యేసరికి మదరాసిపై నెగిటివిటీ వచ్చేసింది.. దాన్ని కవర్ చేయడానికి శివకార్తికేయన్ తెలుగు సినిమాలపై ప్రశంసల వర్షం కురిపించారు. కంటెంట్ విషయంలో టాలీవుడ్ టాప్ అన్నారాయన. మొత్తానికి మన సినిమా గొప్పతనం పరభాషా హీరోలు సైతం కాదనలేకపోతున్నారు.