
సమంత ఎక్కడుంటే అక్కడ సంచలనమే. కొన్నేళ్ళ కింది వరకు సౌత్‌తో సెన్సేషన్స్ క్రియేట్ చేసిన ఈ భామ.. ఇప్పుడు బాలీవుడ్‌లో అదే పని చేస్తున్నారు. చేసింది రెండు సిరీస్‌లే అయినా.. అక్కడి టాప్ హీరోయిన్లకి సైతం చెమటలు పట్టిస్తుంది. పనిలో పనిగా తన పర్ఫార్మెన్స్ ప్లస్ గ్లామర్ షోతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు ఈ భామ.

ఈ మధ్యే విడుదలైన సిటాడెల్ సిరీస్ రివ్యూస్‌తో పని లేకుండా వ్యూస్ పరంగా దూసుకుపోతుంది. దానికి మెయిన్ రీజన్ సమంత. ఈ సిరీస్‌లో ఆమె యాక్షన్ సీక్వెన్సులు ఏ రేంజ్‌లో చేసారో.. బోల్డ్ షోలోనూ రెచ్చిపోయారు.

మరీ ముఖ్యంగా సమంత, వరుణ్ ధావన్ లిప్ లాక్ సీన్స్‌తో సోషల్ మీడియా తగలబడింది ఆ మధ్య. దానికి తోడు యాక్షన్ సీన్స్ అదే రేంజ్‌లో హైలైట్ అయ్యాయి. సిటాడెల్ తర్వాత సమంత పేరు బాలీవుడ్‌లో మరింత మార్మోగుతుంది.

ఈ సిరీస్ తర్వాత సినిమా ఆఫర్స్ వస్తున్నా.. అమ్మడి చూపు మాత్రం కేవలం వెబ్ సిరీస్‌లపైనే ఉంది. రాజ్ డిజే ప్రొడక్షన్‌లోనే రక్త్ బ్రహ్మాండ్‌లో స్యామ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటు యాక్షన్.. అటు గ్లామర్‌తో ముంబై మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుంటున్నారు సమంత.

సినిమాలు చేసినా చేయకపోయినా సమంత మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్‌లోనూ ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ట్విట్టర్ అంతా స్యామ్ పేరే వినిపిస్తుంది. ఆమె ఒక్క ఫోటో పెట్టినా.. ఒక్క పోస్ట్ పెట్టినా రోజంతా ట్రెండింగ్ అవుతూనే ఉంటారు. సమంతకు ఉన్న క్రేజ్‌కు ఇది నిదర్శనం.