
కాస్త గ్యాప్ తీసుకుంటున్నా అని అనౌన్స్ చేసి మరీ, టైమ్ తీసుకున్నారు సామ్. కానీ రీఎంట్రీలోనూ, బౌన్స్ బ్యాక్ కావడంలో మాత్రం అలాంటి అనౌన్స్ మెంట్లు ఏవీ చేయడం లేదు. మాటలతో కాదు, చేతలతో చెప్తా నేనేంటో అన్నట్టుంది ఆమె తీరు..

ఇంతకీ సామ్ ఏం చెప్పదలచుకున్నారు.? ఫ్యామిలీమేన్2 సీరీస్ సూపర్బ్ సక్సెస్ కావడంతో సమంత రోల్‌ని అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేరు. సింహళం కలగలిసిన భాషను సామ్ మాట్లాడిన తీరుకు, స్క్రీన్ మీద రాజీ కేరక్టర్‌ని ఆమె పోట్రే చేసిన విధానానికి ఫిదా అయిపోయారు జనాలు.

ఫ్యామిలీమేన్2 ఎక్కడ ఎండ్ అయిందో, అక్కడే థర్డ్ సీరీస్ మొదలవుతుందని లీక్ చేశారు మనోజ్‌బాజ్‌పాయి. అంటే సమంత ఫిబ్రవరి నుంచి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ షూటింగ్‌లో పార్టిసిపేట్ చేయడానికి రెడీ అయిపోతున్నారన్నమాట.

ఆల్రెడీ సౌత్‌లో ప్రొడక్షన్ హౌస్ పేరుతో ట్రెండ్ అవుతున్న సామ్, నార్త్ లో మాత్రం జలాలుద్దీన్ సాంగ్‌తో ప్రజల మనసుల్లో మెదులుతున్నారు. తన జీవితం అత్యంత దుర్లభమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తాను జలాలుద్దీన్ సాంగ్‌ని విన్నానని అన్నారు సామ్.

సంగీతానికి మనసులని తేలికపరిచే గుణం ఉందని, అందుకు ప్రత్యక్షసాక్ష్యం తానేనని చెబుతూ, సమంత కంటతడి పెట్టిన తీరు నార్త్ జనాలను విపరీతంగా కదిలిస్తోంది. వి ఆర్ విత్ యూ సామ్ అంటూ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు ఉత్తరాది జనాలు.

హసల్3 షోలో చీప్ గెస్ట్ గా పార్టిసిపేట్ చేశారు సామ్. ఆ షోలో ఆమె మాట్లాడిన హిందీకి కూడా ఫిదా అవుతున్నారు జనాలు. కంప్లీట్ కాన్‌సెన్‌ట్రేషన్ నార్త్ మీద ఉండబట్టి హిందీ కూడా స్పష్టంగానే నేర్చుకున్నారని అంటున్నారు నెటిజన్లు.

సామ్ యాక్టివిటీస్‌ని జాగ్రత్తగా గమనిస్తే, ఆమె త్వరలోనే స్క్రీన్ మీద యాక్టివ్ అవుతారనే టాక్ వినిపిస్తోంది.