- Telugu News Photo Gallery Cinema photos Rukmini Vasanth latest graceful looks in trendy dress goes viral in internet
Rukmini Vasanth: ఈ సొగసరి ప్రేమకై ఆ జాబిల్లి భువికి చేరింది.. గ్రేస్ఫుల్ రుక్మిణి..
రుక్మిణి వసంత్ ఒక భారతీయ నటి, ఆమె ప్రధానంగా కన్నడ చిత్ర పరిశ్రమలో పనిచేసింది. 2023 కన్నడ చిత్రం సప్త సాగరదాచే ఎల్లోలో ప్రియ పాత్ర పోషించినందుకు ఆమె విస్తృత విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలకు షేర్ చేసింది ఈ బ్యూటీ. ఈ ఫోటోలను చుసిన అభిమానులు వీటిని తెగ వైరల్ చేస్తున్నారు. మీరు కూడా వీటిపై ఓ లుక్కేయండి.
Updated on: Jun 13, 2025 | 3:50 PM

10 డిసెంబర్ 1994న కర్ణాటకలోని బెంగళూరులో కన్నడ మాట్లాడే కుటుంబంలో జన్మించింది రుక్మిణి వసంత్. ఆమె తండ్రి, కల్నల్ వసంత్ వేణుగోపాల్, కర్నాటక నుండి భారతదేశం యొక్క అత్యున్నత శాంతికాల సైనిక అలంకరణ అయిన అశోక చక్రాన్ని పొందిన మొదటి వ్యక్తి. ఆమె తల్లి సుభాషిణి వసంత్ కర్ణాటకలో యుద్ధ వితంతువులకు మద్దతుగా ఒక ఫౌండేషన్‌ను స్థాపించిన నిష్ణాతుడైన భరతనాట్య నృత్యకారిణి.

ఆర్మీ స్కూల్, ఎయిర్ ఫోర్స్ స్కూల్ మరియు సెంటర్ ఫర్ లెర్నింగ్‌లో చదువుకుంది. ఆమె లండన్‌లోని బ్లూమ్స్‌బరీలోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్ నుండి నటన డిగ్రీ పట్టా పొందింది ఈ వయ్యారి భామ.

ప్రారంభంలో థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టింది. తర్వాత నటి కావాలన్న ఆసక్తితో సినిమాల్లోకి వచ్చింది. 2019 బీర్బల్ త్రైలోజి జి కేస్ 1: ఫైండింగ్ వజ్రముని అనే సినిమాతో చలనచిత్ర అరంగేట్రం చేసింది. అదే ఏడాది ఆప్ స్టైర్స్ సినిమాలో కనిపించింది.

2023లో సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ, బాణదరియల్లి, సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ బి అనే మూడు కన్నడ చిత్రాల్లో కథానాయకిగా ఆకట్టుకుంది. సప్త సాగరదాచే ఎల్లో సైడ్ ఎ & సైడ్ బి తెలుగులో సప్తసాగరాలు దాటి సైడ్ ఎ & సైడ్ బిగా విడుదలయ్యాయి.

2024లో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. తర్వాత బఘీరా, భైరతి రణగల్ అనే రెండు కన్నడ చిత్రాల్లో కథానాయికగా ఆకట్టుకుంది. ఈ ఏడాది ACE అనే సినిమాతో తమిళంలో తొలిసారి నటించింది. మద్రాసీ అనే మరో తమిళ భాష చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తుంది. తెలుగులో ప్రశాంత నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన కథానాయికగా నటిస్తుంది.ఇంకా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేయలేదు.




