- Telugu News Photo Gallery Cinema photos Rishab Shetty's Kantara Chapter 1 Movie latest movie update on 07 02 2025
Kanthara: ఆస్కార్ లక్ష్యంగా తెరకెక్కుతున్న కాంతార చాప్టర్ 1
మనం సినిమా చేశాక, ఔట్‌పుట్ బాగా వచ్చిందనుకున్నాక... అవార్డులకు పంపుకోవడం మొన్న మొన్నటిదాకా జరిగిందేమో.. ఇప్పుడలా కాదు... మనకేం కావాలో ముందుగా అనుకుని..., దాన్ని బట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుని పక్కాగా ఫాలో అయి గోల్ కొడుతున్నారు. మరి కాంతారతో హోంబలే ఫిల్మ్స్ అనుకున్న గోల్ కొట్టి తీరుతుందా? మాట్లాడుకుందాం పదండి..
Updated on: Feb 07, 2025 | 11:55 PM

నాటు నాటు అంటూ ఆస్కార్ వేదిక మీద మన సినిమా నాటు కొట్టుడు కొట్టేసింది. ఆస్కార్ ప్రాంగణంలో ట్రిపుల్ ఆర్ టీమ్‌ని చూసిన తర్వాత మన దగ్గర చాలా మంది నెక్స్ట్ మనం అక్కడికి వెళ్లాలని అనుకున్నారు.

అలా అనుకున్న వారిలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది కంగువ టీమ్. ఎంతో కష్టపడి చేసిన కంగువ సిల్వర్ స్క్రీన్ మీద మెప్పించలేకపోయింది. జనాలు కంగువతో కనెక్ట్ కాలేకపోయారు. ఆస్కార్ రేసులో ఉన్నట్టే అనిపించినా ఆఖరిదాకా ట్రావెల్ చేయలేకపోయింది.

ఈ విషయంలో ముందు నుంచే ప్లానింగ్‌గా ఉంది కాంతార యూనిట్. పర్ఫెక్ట్ గా ప్లానింగ్ చేసుకుని ఉంటే, కాంతార ఫస్ట్ పార్టుతోనే ఆస్కార్ ట్రై చేయాల్సిందన్నది హోంబలే సంస్థ అప్పట్లో ఫీల్ అయిన విషయం.

సరే, అయిందెలాగో అయిపోయింది... ఇక ఫ్యూచర్‌లో జరగాల్సినదాని గురించి ఆలోచిద్దామని అప్పుడే ఫిక్స్ అయిపోయారు. అందుకే కాంతార చాప్టర్ ఒన్ విషయంలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కాంతార చాప్టర్ ఒన్ కోసం దాదాపు 500 మంది పనిచేస్తున్నారు.

అందరూ దాదాపు మార్షల్ ఆర్ట్స్ మీద అవగాహన ఉన్నవారే. ఈ యుద్ధం ఎపిసోడ్ కోసమే కళరిపయట్టుతోపాటు గుర్రపు స్వారీ తదితర విద్యల్లో ప్రావీణ్యం సంపాదించారు రిషబ్ శెట్టి. అక్టోబర్‌లో వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ కి విజువల్ ఫీస్ట్ గ్యారంటీ అని భరోసా ఇస్తోంది కాంతార టీమ్. ముందు బాక్సాఫీస్‌ని కొల్లగొట్టి, ఆ వెంటనే ఆస్కార్ మీద దండయాత్ర చేయాలన్నది రిషబ్ ప్లాన్.




