మెల్లిగా తగ్గుతున్న రీ రిలీజుల క్రేజ్ !! రీసెంట్ రిలీజే అందుకు ఎగ్జాంపుల్
స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాల రీరిలీజులంటే మొన్న మొన్నటి వరకు కూడా సూపర్ డూపర్ క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు మెల్లిగా ఆ కరిజ్మా తగ్గుతోంది. ఎంత క్రేజ్ ఉన్న సినిమాలకైనా థియేటర్లలో రెస్పాన్స్ అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. రీసెంట్ రిలీజే అందుకు ఎగ్జాంపుల్ అంటున్నారు క్రిటిక్స్. ఇంతకీ ఆ సినిమా ఏంటి? మన దగ్గరున్న సిట్చువేషన్ అదర్ లాంగ్వేజెస్‌లోనూ ఉందా? పోకిరి రీ రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు.
Updated on: Nov 20, 2023 | 9:46 PM

స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాల రీరిలీజులంటే మొన్న మొన్నటి వరకు కూడా సూపర్ డూపర్ క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు మెల్లిగా ఆ కరిజ్మా తగ్గుతోంది. ఎంత క్రేజ్ ఉన్న సినిమాలకైనా థియేటర్లలో రెస్పాన్స్ అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. రీసెంట్ రిలీజే అందుకు ఎగ్జాంపుల్ అంటున్నారు క్రిటిక్స్. ఇంతకీ ఆ సినిమా ఏంటి? మన దగ్గరున్న సిట్చువేషన్ అదర్ లాంగ్వేజెస్‌లోనూ ఉందా?

పోకిరి రీ రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. పవన్ కల్యాణ్, ప్రభాస్, తారక్, అల్లు అర్జున్.. స్టార్ హీరోలందరి సినిమాలకూ అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. కొన్నిచోట్ల ఫ్యాన్స్ చేసే హంగామాకు థియేటర్ల ఓనర్లు కూడా హడలిపోయారు. కానీ ఇప్పుడు క్రేజ్ తగ్గిపోతోందన్నది క్రిటిక్స్ మాట.

తారక్ నటించిన అదుర్స్ మూవీకి ఎప్పుడూ సెపరేట్ సెక్షన్ ఆఫ్ ఫ్యాన్స్ ఉంటారు. ఎన్నిసార్లు చూసినా కడుపుబ్బ నవ్వించే సినిమా అది. ఈ చిత్రం రీ రిలీజ్ సందడి మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదన్నది ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

ఈ ట్రెండ్ మొదలైనప్పటితో పోలిస్తే, ఇప్పుడు చాలా వరకు క్రేజ్ తగ్గిందన్నది వైరల్ న్యూస్. మన దగ్గర మెల్లిగా తగ్గుతున్న ఈ కల్చర్ కోలీవుడ్‌లో మాత్రం ఊపందుకుంటోంది.

ముత్తు, ఆళవందాన్ తరహా సినిమాల రీ రిలీజ్ డేట్లు నెట్టింట్లో తంబిలను ఊరిస్తున్నాయి. మరి వాటికైనా మంచి ఆదరణ ఉంటుందా? లేకుంటే అదుర్స్ సీన్‌ని రిపీట్ చేస్తాయా? అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.




