
ఇండియన్ సినిమాల బడ్జెట్‌లు కోటలు దాటుతున్నాయా? అంటే అసలు ఏమాత్రం తడుముకోకుండా యస్ అని అంటున్నారు ట్రేడ్ పండిట్స్. ఈ బడ్జెట్ విషయంలో నార్త్, సౌత్ అనే తేడా ఏమాత్రం లేదు. నువ్వా నేనా అన్నట్టు పోటీపడుతున్నారు మేకర్స్.

కల్కి సినిమా బడ్జెట్ ఎంత? 600 కోట్లని చెబుతోంది వికీ. బాగా పేరున్న ఆర్టిస్టులు నటిస్తున్నారు కాబట్టి, వారి పారితోషికాలు, ఫ్యూచరిస్టిక్ సినిమా కాబట్టి.. ఆ మెటీరియల్ డిజైనింగ్‌కి అయిన ఖర్చులు అన్నీ కలిపి, రిలీజ్ డే రోజున ఈ నెంబర్‌లో డ్రాస్టిక్ చేంజ్ కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

రణ్‌బీర్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న నార్త్ రామాయణం బడ్జెట్ కూడా ట్రేడ్ వర్గాల్లో డిస్కసింగ్ పాయింట్ అవుతోంది. దాదాపు 835 కోట్ల వ్యయంతో తెరకెక్కిస్తున్నారట ఈ సినిమాను.

భారీ సెట్స్, విజువల్ ఎఫెక్స్ట్.. వీటన్నిటికీ కలిపితే ఆ మాత్రం ఖర్చు అవుతుందిలే అని మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. ఇక మన దగ్గర ప్రీ ప్రొడక్షన్‌లో ఉన్న మహేష్ - రాజమౌళి సినిమా బడ్జెట్ గురించి కూడా గట్టిగానే మాటలు వినిపిస్తున్నాయి.

పిండి కొద్దీ రొట్టె కాబట్టి, ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ లెవల్లో రావాలంటే, బడ్జెట్ కూడా అలాగే ఉండాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఇంత అని అనుకోకపోయినా, ఎంతయినా వెనకాడేది లేదన్న మాట వినిపించింది కె.ఎల్.నారాయణ రీసెంట్ స్టేట్‌మెంట్‌లో!