- Telugu News Photo Gallery Cinema photos Ram Charan, Surekha and Allu Aravind meet Janasena Chief Pawan Kalyan in Pithapuram ahead of AP Assembly Election
Pawan Kalyan: పిఠాపురంలో బాబాయ్‌తో అబ్బాయ్.. పవన్ కల్యాణ్‌ను కలిసిన రామ్ చరణ్, సురేఖ.. ఫొటోస్ ఇవిగో
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు. మొదట స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత నేరుగా బాబాయ్ పవన్ కల్యాణ్ ఇంటికి బయలు దేరారు. చెర్రీ వెంట జనసేన అభిమానులు, కార్యకర్తలు భారీగా పవన్ నివాసానికి చేరుకున్నారు.
Updated on: May 11, 2024 | 4:16 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు. మొదట స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత నేరుగా బాబాయ్ పవన్ కల్యాణ్ ఇంటికి బయలు దేరారు. చెర్రీ వెంట జనసేన అభిమానులు, కార్యకర్తలు భారీగా పవన్ నివాసానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ను ఆప్యాయంగా హత్తుకున్నారు రామ్ చరణ్ , సురేఖ. జనసేన అధిపతి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట నిర్మాత అల్లు అరవింద్ కూడా ఉన్నారు.

అనంతరం బయటకు వచ్చి జనసేన అభిమానులు, కార్యకర్తలకు కలిసి అభివాదం చేశారు పవన్, రామ్ చరణ్. బాబాయ్, అబ్బాయ్ లను ఒకే ఫ్రేమ్‌లో చూడడంతో అభిమానులు ఉప్పొంగిపోయారు.

పవన్, రామ్ చరణ్ లను చూసి జనసేన అభిమానులు కేకలు, అరుపులతో హోరెత్తించారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులందరూ కోరారు. చిరంజీవి వీడియోను షేర్ చేసిన రామ్ చరణ్ 'మీ భవిష్యత్ కోసం పాటు పడే నాయకుడు పవన్ కల్యాణ్ గారిని గెలిపించండి' అని పిలుపునిచ్చారు