- Telugu News Photo Gallery Cinema photos Rajinikanth lokesh kanagaraj movie Thalaivar 171 Pre production work Update and details here Telugu heroes Photos
Thalaivar 171: లియో విషయంలో జరిగిన పొరపాటు రజిని మూవీలో జరగనివ్వని క్రేజీ కెప్టెన్ లోకేష్.
ప్రజెంట్ రజనీకాంత్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న లోకేష్ కనగరాజ్, అప్ కమింగ్ సినిమాల విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ముఖ్యంగా లియో విషయంలో జరిగిన పొరపాటు మళ్లీ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకే రజనీ సినిమా మొదలు కాకముందే ఆ తరువాత చేయబోయే సినిమా విషయంలోనూ ప్లాన్ రెడీ చేస్తున్నారు.
Updated on: Mar 29, 2024 | 9:45 PM

తాజాగా యూనిట్ సైడ్ నుంచి మరింత క్లారిటీ వస్తోంది. సీక్వెల్‌ను జైలర్ 2 పేరుతో కాకుండా హుకుం పేరుతో ప్లాన్ చేస్తున్నారట నెల్సన్. అంతేకాదు పార్ట్ 2ను పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా డిజైన్ చేస్తున్నారు.

లోకేష్ మార్క్ డార్క్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన లియో సినిమా మంచి విజయం సాధించినా... బ్లాక్ బస్టర్ అన్న రేంజ్‌కు రీచ్ అవ్వలేకపోయింది. ముఖ్యంగా సినిమాలో సెకండాఫ్ విషయంలో చాలా కంప్లయింట్స్ వినిపించాయి. ఈ సినిమా ఎనౌన్స్‌మెంట్ సమయంలోనే రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు.

దీంతో సినిమా త్వరగా పూర్తి చేయాల్సి వచ్చింది. అందుకే డీటైలింగ్ మిస్ అయ్యిందని ఒప్పుకున్నారు. లియో విషయంలో జరిగిన పొరపాటు నెక్ట్స్ మూవీలో జరగదని భరోసా ఇస్తున్నారు ఈ క్రేజీ కెప్టెన్. ఇప్పటికే రజనీకాంత్ హీరోగా ఓ సినిమా ఎనౌన్స్ చేసిన లోకేష్, ఆ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.

లియో రిజల్ట్ తరువాత స్క్రిప్ట్ స్టేజ్‌లోనే మరింత కేర్ తీసుకుంటున్నారు. కేవలం స్క్రిప్ట్ వర్క్‌కే ఆరు నెలల పాటు కేటాయించిన డైరెక్టర్ జూన్‌లో షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రజనీ సినిమా రిలీజ్ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు లోకేష్.

రోలెక్స్ కథ ప్రధానంగా లోకేష్ తీయబోయే సినిమా, విజయ్ నటించిన లియో కూడా ఈ కైండ్ ఆఫ్ మూవీసే. దయ లేని హీరోల దండయాత్రే ఇప్పుడు సిల్వర్‌స్క్రీన్ సక్సెస్ మంత్రా అవుతోందని అంటున్నారు విమర్శకులు.

అయితే రజనీ సినిమా స్టార్ట్ చేయడానికి ఆరు నెలల గ్యాప్ తీసుకున్న లోకేష్, ఆ తరువాత చేయాల్సిన మూవీని మాత్రం నెల రోజుల్లోనే స్టార్ట్ చేస్తా అన్నారు. రజనీ సినిమా తరువాత ఖైదీ 2 సెట్స్ మీదకు వెళుతుందని క్లారిటీ ఇచ్చారు లోకేష్.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయ్యింది. అందుకే రజనీ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే నెల రోజుల్లో ఖైదీ 2 సెట్స్ మీదకు తీసుకెళ్తానని చెప్పారు.




