Coolie: రజిని టార్గెట్ 1000 కోట్లు.. కానీ అది ఒక్కటే అడ్డు.. అది దాటితే ట్రెండు

Edited By: Phani CH

Updated on: Aug 04, 2025 | 9:21 PM

1000 కోట్లే లక్ష్యంగా దిగుతున్న కూలీ సినిమాకు అనుకోని అడ్డంకి ఎదురైంది. ఇప్పుడు దీనికి 1000 కోట్లు రావాలంటే.. ఇప్పటి వరకు ఇండియాలో ఏ సినిమాకు సాధ్యం కాని ఓ రికార్డ్ అందుకోవాలి. తాజాగా ట్రైలర్ వచ్చింది.. లోకేష్ మ్యాజిక్ కనిపిస్తుంది. అన్నీ బాగానే ఉన్నా.. కూలీని ఇబ్బంది పెడుతున్న ఆ విషయమేంటి..?

1 / 5
మోస్ట్ అవైటెడ్ కూలీ ట్రైలర్ వచ్చేసింది.. ఎప్పట్లాగానే లోకేష్ కనకరాజ్ మరోసారి తన మార్క్ చూపించారు. విడుదలకు 2 వారాల ముందే అభిమానులకి సినిమా ఇలా ఉండబోతుంది అంటూ ఓ అంచనా ఇచ్చి.. అంచనాలు భారీగా పెంచేసారు లోకేష్.

2 / 5
అయితే అన్నీ బాగానే ఉన్నా.. కూలీ సినిమా 1000 కోట్ల క్లబ్బులో చేరాలంటే ముందుగా పెద్ద పర్వతమే దాటాలి. 1000 కోట్లు అనేది ఏ హీరోకైనా కలే..! తెలుగు, కన్నడ, హిందీ ఇండస్ట్రీలకు సాధ్యమైన ఈ రికార్డ్.. తమిళ వాళ్లను మాత్రం ఇంకా ఊరిస్తూనే ఉంది.

3 / 5
అక్కడ లియో, విక్రమ్, జైలర్ లాంటి సినిమాలు వందల కోట్లు వసూలు చేసినా 1000 కోట్ల వరకు మాత్రం వాటి ప్రయాణం సాగలేదు. దాంతో ఆశలన్నీ కూలీపైనే ఉన్నాయిప్పుడు. ఈ సినిమాకు A సర్టిఫికేట్ వచ్చింది.

4 / 5
A సర్టిఫికేట్ వచ్చిన సినిమాలేవీ ఇప్పటి వరకు 1000 కోట్ల క్లబ్బులో చేరలేదు. రణ్‌బీర్ కపూర్ యానిమల్ వసూలు చేసిన 900 కోట్లే ఏ సర్టిఫికేట్ సినిమాల్లో రికార్డు. ఇప్పుడు కూలీ దీన్ని దాటితే గానీ 1000 కోట్లు చేరుకోదు. అడల్ట్ రేటెడ్ అంటే కుటుంబ ప్రేక్షకులు దూరంగా ఉంటారు.. పైగా రజినీ కెరీర్‌లో కొన్ని దశాబ్ధాల వచ్చిన ఏ సర్టిఫికేట్ ఇది.

5 / 5
1000 కోట్ల అకౌంట్ ఓపెన్ చేసిన బాహుబలి 2.. కంటిన్యూ చేసిన కేజియఫ్ 2, పుష్ప 2, కల్కి, పఠాన్, జవాన్, ట్రిపుల్ ఆర్ సినిమాలకు U/A సర్టిఫికేట్ వచ్చింది.. వాటికి ఫ్యామిలీ ఆడియన్స్ బలం ఉంది. కానీ కూలీకి A సర్టిఫికేట్ వచ్చింది. ఇదే రజినీ ముందున్న పెద్ద లక్ష్యం. మరి పెద్దలకు మాత్రమే అంటూ వస్తున్న కూలీ.. 1000 కోట్లు కొడుతుందా అనేది చూడాలి.