
సంక్రాంతికి వచ్చిన మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున, తేజ సజ్జా ఇంకొన్ని రోజుల వరకు షూటింగ్‌కు రానట్లే. ఇక సలార్ మత్తు నుంచి త్వరగానే బయటకొచ్చి నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కేతో బిజీ అయ్యారు ప్రభాస్.

కల్కి షూటింగ్ ప్రస్తుతం శంకరపల్లిలో జరుగుతుంది. అలాగే మారుతి రాజా సాబ్‌కు డేట్స్ ఇచ్చారు రెబల్ స్టార్. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల దేవర షూటింగ్ అల్యూమీనియం ఫ్యాక్టరీలోనే జరుగుతుంది.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా షూటింగ్ 3 వారాలుగా RFCలోనే జరుగుతుంది. అక్కడే కీ సీన్స్ చిత్రీకరిస్తున్నారు సుకుమార్. రామ్ చరణ్, శంకర్ గేమ్ చేంజర్ షూటింగ్‌కు ఇంకొన్ని రోజులు బ్రేక్ తప్పేలా లేదు.

బాలకృష్ణ, బాబీ సినిమా షూటింగ్ నాంపల్లి నుంచి BHELకి షిఫ్ట్ అయింది. ఇందులో విలన్‌గా బాబీ డియోల్ నటిస్తున్నారు. నాని, వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారం షూటింగ్ ఓల్డ్ సిటీలో జరుగుతుంది.

రవితేజ, హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ షూటింగ్ కరైకూడిలో జరుగుతుంది. నాగ చైతన్య, చందూ మొండేటి తండేల్ చిత్ర షూటింగ్ ఉడిపిలో.. నితిన్ రాబిన్ హుడ్ షూటింగ్ కేరళలో.. దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్నాయి.