- Telugu News Photo Gallery Cinema photos Heroine Anushka Shetty next Movie details and Update bhagamathi 2 Telugu Actress Photos
Anushka Shetty: అనుష్క నెక్ట్స్ సినిమా ఏంటి.? కన్ఫ్యూజన్‌లో స్వీటీ.. ఇంట్రెస్టింగ్ బజ్.
అనుష్క తర్వాతి సినిమా ఏంటి..? మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విజయం తర్వాత కూడా ఈమె సైలెంట్‌గా ఉండటానికి కారణమేంటి.? జేజమ్మకు ఆఫర్స్ రావట్లేదా లేదంటే వచ్చిన ఆఫర్స్‌కు ఆమె నో చెప్తున్నారా..? అసలు సమస్య ఎక్కడుంది.? ఒకప్పట్లా వరసగా సినిమాలు చేయడానికి అనుష్క ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు.? ఈమె తర్వాతి ప్రాజెక్ట్ ఏమై ఉండొచ్చు..? ఆ డీటైల్స్ అన్నీ ఈ స్టోరీలో చూద్దాం.. సినిమాలు చేసినా చేయకపోయినా కొందరు హీరోయిన్లపై అభిమానం మాత్రం అస్సలు తగ్గదు.
Updated on: Jan 31, 2024 | 2:12 PM

అనుష్క తర్వాతి సినిమా ఏంటి..? మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విజయం తర్వాత కూడా ఈమె సైలెంట్‌గా ఉండటానికి కారణమేంటి..? జేజమ్మకు ఆఫర్స్ రావట్లేదా లేదంటే వచ్చిన ఆఫర్స్‌కు ఆమె నో చెప్తున్నారా..? అసలు సమస్య ఎక్కడుంది..?

ఒకప్పట్లా వరసగా సినిమాలు చేయడానికి అనుష్క ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు..? ఈమె తర్వాతి ప్రాజెక్ట్ ఏమై ఉండొచ్చు..? ఆ డీటైల్స్ అన్నీ ఈ స్టోరీలో చూద్దాం.. సినిమాలు చేసినా చేయకపోయినా కొందరు హీరోయిన్లపై అభిమానం మాత్రం అస్సలు తగ్గదు.

అందులో అనుష్క శెట్టి కూడా ఉంటారు. మూడు నాలుగేళ్లకోసారి కనిపిస్తున్నా కూడా జేజమ్మపై ఇంత కూడా ప్రేమ తగ్గట్లేదు ఫ్యాన్స్‌లో. అదంతా ఓకే కానీ.. అనుష్క నెక్ట్స్ సినిమాపై కన్ఫ్యూజన్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది.

ఎందుకో మళ్లీ గ్యాప్ తీసుకుంటున్నారు ఈ బ్యూటీ. అనుష్క ప్రస్తుతం తెలుగులో సినిమాలేవీ చేయట్లేదు.. మలయాళంలో మాత్రం కథనార్ అనే సినిమా చేస్తున్నారు.

ఈ చిత్ర షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది. పీరియడ్ ఫాంటసీ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో మలయాళ సీనియర్ నటుడు జయసూర్య హీరోగా నటిస్తున్నారు.

ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకొస్తున్నారు మేకర్స్. 2024లోనే ఈ రెండు పార్ట్స్ విడుదల కానున్నాయి. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో ఐదేళ్ళ తర్వాత వచ్చి విజయం అందుకున్నారు అనుష్క.

త్వరలోనే ఈమె భాగమతి 2 చేయబోతున్నట్లు తెలుస్తుంది. అశోక్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

దీని సీక్వెల్ చేయాలని చూస్తున్నారు స్వీటీ. దాంతో పాటు చిరంజీవి విశ్వంభరలో అనుష్కను హీరోయిన్‌గా అడుగుతున్నారు. మొత్తానికి స్వీటీ స్టెప్ ఎటువైపు పడుతుందో చూడాలిక.




