- Telugu News Photo Gallery Cinema photos Prabhas, Imanvi and Hanu Raghavapudi's Fauji Movie Opening Pooja Ceremony photos
Fauji: డార్లింగ్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్.. హను ఛాయిస్ సూపరేనా !!
ప్రభాస్ ఫ్యాన్స్ ఇవాళ డబుల్ కా మీఠా తిన్నంత ఖుషీగా ఉన్నారు. అందుకు రీజన్... అభిమాన హీరో సినిమా ఓపెనింగ్ కావడం మాత్రమే కాదు, సీతారామమ్‌ని తలదన్నేలా మంచి పాటలు వినబోతున్నామని.... మ్యూజిక్ డైరక్టర్ల విషయాన్ని ఎప్పుడూ కెప్టెన్ల ఛాయిస్‌కే వదిలేస్తుంటారు డార్లింగ్. ప్రభాస్ హను సినిమాలో అదే ప్లస్ పాయింట్ అవుతుందా?
Updated on: Aug 19, 2024 | 3:28 PM

ప్రభాస్ ఫ్యాన్స్ ఇవాళ డబుల్ కా మీఠా తిన్నంత ఖుషీగా ఉన్నారు. అందుకు రీజన్... అభిమాన హీరో సినిమా ఓపెనింగ్ కావడం మాత్రమే కాదు, సీతారామమ్‌ని తలదన్నేలా మంచి పాటలు వినబోతున్నామని.... మ్యూజిక్ డైరక్టర్ల విషయాన్ని ఎప్పుడూ కెప్టెన్ల ఛాయిస్‌కే వదిలేస్తుంటారు డార్లింగ్. ప్రభాస్ హను సినిమాలో అదే ప్లస్ పాయింట్ అవుతుందా?

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, క్రియేటివ్ డైరక్టర్ హనురాఘవపూడి, ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రారంభమైంది. కల్కి సినిమా తెచ్చి పెట్టిన విజయోత్సాహం డార్లింగ్‌లో స్పష్టంగా కనిపించింది.

హిస్టారికల్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఒకానొక సందర్భంలో తను నమ్మిన సిద్ధాంతానికి... యుద్ధం మాత్రమే సమాధానం చెబుతుందనుకునే వారియర్ కథను అద్భుతంగా చూపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

పాటల విషయంలో కెప్టెన్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చే డార్లింగ్ ఈ సారి హను రాఘవపూడికి కూడా అలాంటి అవకాశమే ఇచ్చారు. విశాల్ చంద్రశేఖర్ బాణీలు ఎప్పుడెప్పుడు విందామా అని ఎదురుచూపులు అప్పుడే మొదలయిపోయాయి. ఆల్రెడీ మూడు పాటల కంపోజింగ్ పూర్తయిందన్నది టాక్.

ప్రభాస్ హను మూవీలో ట్రెండ్ అవుతున్న మరో విషయం హీరోయిన్. ప్రభాస్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన ఇమాన్వీ ఇస్మాయిల్ ఎవరనే టాక్ ఆల్రెడీ షురూ అయింది. ఇమాన్వీ ఇన్‌స్టా రీల్స్, ఆమె పుట్టు పూర్వోత్తరాల గురించి ఇన్‌స్టంట్‌గా సెర్చి మొదలైంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్‌తో షురూ కానున్న ఈ సినిమా, మున్ముందు... ఇంకెన్ని ఆసక్తికరమైన విషయాలను పరిచయం చేస్తుందోనని ఇష్టంగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.