ట్రెండింగ్‌లో పవర్‌స్టార్.. ఓజీ కోసం పవర్‌స్టార్ స్పెషల్ ప్రిపరేషన్
పవన్ కల్యాణ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నారు. హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేయడం, ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడటం... మాత్రమే కాదు.. ఓజీ పరంగానూ ట్రెండ్ అవుతున్నారు పవర్‌స్టార్. ఇంతకీ ఆ విషయం ఏంటి? ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన క్షణాలు రానే వచ్చాయి. హరిహరవీరమల్లు షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టేశారు.
Updated on: May 08, 2025 | 7:27 PM

పవన్ కల్యాణ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నారు. హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేయడం, ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడటం... మాత్రమే కాదు.. ఓజీ పరంగానూ ట్రెండ్ అవుతున్నారు పవర్‌స్టార్. ఇంతకీ ఆ విషయం ఏంటి?

ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన క్షణాలు రానే వచ్చాయి. హరిహరవీరమల్లు షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టేశారు. క్రిష్ మొదలుపెట్టిన ప్రాజెక్టును జ్యోతికృష్ణ కంప్లీట్ చేశారు. ఫైనల్ షెడ్యూల్‌లో సెట్లో త్రివిక్రమ్ కూడా కనిపించారు.

ఫ్రెండ్లీగా వచ్చారా? లేకుంటే వీరమల్లుకు ఏమైనా హెల్ప్ చేశారా? అనే చర్చ ఎలాగూ నడుస్తోంది. ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ సెలబ్రిటీల గురించి పవన్ కల్యాణ్ ప్రస్తావించిన తీరు సూపర్ అంటూ ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.

పనిలో పనిగా ఓజీ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ నెల్లోనే ఓజీ షెడ్యూల్‌కి హాజరు కానున్నారు పవర్‌స్టార్. ఈ మూవీలో షర్ట్ లెస్ సీన్స్ చేయడానికి పవర్‌స్టార్ ఓకే చెప్పారన్నది వైరల్ న్యూస్. కెరీర్ బిగినింగ్‌లో అలా కనిపించారు పవన్.

ఇన్నాళ్ల తర్వాత మళ్లీ తమ అభిమాన హీరో అలా కనిపించడానికి ఒప్పుకున్నారంటే, కంటెంట్ బలంగా ఉంటుందని మాట్లాడుకుంటున్నారు పవర్ సైనికులు.




