- Telugu News Photo Gallery Cinema photos Pawan Kalyan OG movie release date fixed, to come 10 years after idea creation
OG: పదేళ్ళ తర్వాత అదే డేట్‌కు వస్తున్న పవన్ కళ్యాణ్
సరిగ్గా పదేళ్ల కింద తెలుగు ఇండస్ట్రీలో ఓ సునామి వచ్చింది.. దాని ఆనవాళ్లు ఇంకా అలాగే ఉన్నాయి. అదొచ్చినపుడు ఒక్క రికార్డ్ కూడా మిగల్లేదు. సగం సినిమా విడుదలకు ముందే లీకైనా.. ఆఫ్టర్ రిలీజ్ అది చేసిన రచ్చకు బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. అలాంటోడు అదే డేట్‌కు ఇప్పుడు మళ్లీ వస్తున్నాడు. మరి ఎవరా సునామి.. సేమ్ డేట్‌కు వస్తున్న ఆ సినిమా ఏంటి..? అత్తారింటికి దారేది.. అంత ఈజీగా మరిచిపోయే పేరు కాదిది. చిన్నపుడు ఆడుకున్న సరదా పాటనే టైటిల్‌గా పెట్టి ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు త్రివిక్రమ్.
Updated on: Feb 07, 2024 | 12:50 PM

సరిగ్గా పదేళ్ల కింద తెలుగు ఇండస్ట్రీలో ఓ సునామి వచ్చింది.. దాని ఆనవాళ్లు ఇంకా అలాగే ఉన్నాయి. అదొచ్చినపుడు ఒక్క రికార్డ్ కూడా మిగల్లేదు. సగం సినిమా విడుదలకు ముందే లీకైనా.. ఆఫ్టర్ రిలీజ్ అది చేసిన రచ్చకు బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. అలాంటోడు అదే డేట్‌కు ఇప్పుడు మళ్లీ వస్తున్నాడు. మరి ఎవరా సునామి.. సేమ్ డేట్‌కు వస్తున్న ఆ సినిమా ఏంటి..?

అత్తారింటికి దారేది.. అంత ఈజీగా మరిచిపోయే పేరు కాదిది. చిన్నపుడు ఆడుకున్న సరదా పాటనే టైటిల్‌గా పెట్టి ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా పదేళ్ళ కిందే 80 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి.. రికార్డుల రూపు రేఖలు మార్చేసింది. మళ్లీ ఇన్నేళ్లకు అదే రోజు మరో సినిమాతో రాబోతున్నారు పవర్ స్టార్.

సెప్టెంబర్ 27, 2013న అత్తారింటికి దారేది విడుదలైంది. 2024లో అదే రోజు OG రాబోతుంది. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఉన్న అంచనాలు మాటల్లో చెప్పడం కష్టమే. పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నింట్లోనూ దీనిపైనే హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి కారణం ఇదొక్కటే స్ట్రెయిట్ సినిమా కావడం.. ఇందులో పవన్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తుండటం.

ముంబై మాఫియా నేపథ్యంలో ఓజి వస్తుంది. డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఓజి రాబోతుంది. ఇందులో మొదటి భాగం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు మేకర్స్. చాలా ఏళ్ళ తర్వాత పవన్ గ్యాంగ్ స్టర్‌గా నటిస్తున్నారు. దానికితోడు టీజర్‌తోనే హైప్ ఆకాశమంత ఎత్తుకు చేర్చేసారు దర్శకుడు సుజీత్.

ఓజి షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తైపోయింది. ప్రస్తుతం ఏపీ ఎన్నికలపై ఫోకస్ చేసారు పవన్ కళ్యాణ్. ఎప్రిల్‌లో ఎలక్షన్స్ పూర్తి కాగానే.. ఫలితాలతో సంబంధం లేకుండా ముందు ఓజి పూర్తి చేయనున్నారు. ఓజి తర్వాతే ఉస్తాద్, హరిహర వీరమల్లుపై ఫోకస్ చేయనున్నారు. ఇవే కాదు.. త్రివిక్రమ్, సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉన్నాయి. మొత్తానికి అత్తారింటికి దారేది వచ్చిన రోజే.. ఓజి కూడా రాబోతుంది.




