- Telugu News Photo Gallery Cinema photos Pawan Kalyan is airport and Keedaa Cola Pre Release Event latest movie news from film industry
Movie News: హైదరాబాద్ ఎయిర్పోర్ట్‌లో పవన్ కళ్యాణ్.. క్రీడా కోలా ప్రీ రిలీజ్ వేడుకకు ఆ హీరో..
నవంబర్ 1న ఇటలీలో జరగనున్న వరుణ్ తేజ్ పెళ్లి కోసం పవన్ కళ్యాణ్ సతీసమేతంగా అక్కడికి వెళ్లారు. తరుణ్ భాస్కర్ నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా క్రీడా కోలా. నవంబర్ 3న సినిమా విడుదల కానుంది. హీరో విక్రమ్ వరుస సినిమాలు ప్రకటిస్తూనే ఉన్నారు. అరడజన్ పైగా సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల.. అన్ని సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయడంలో విఫలమవుతున్నారు. చిరంజీవి కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ఖైదీ.
Updated on: Oct 29, 2023 | 12:48 PM

నవంబర్ 1న ఇటలీలో జరగనున్న వరుణ్ తేజ్ పెళ్లి కోసం పవన్ కళ్యాణ్ సతీసమేతంగా అక్కడికి వెళ్లారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్‌లో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అక్టోబర్ 30 నుంచి వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలు మొదలు కానున్నాయి. సంగీత్, ప్రీ వెడ్డింగ్ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మెగా హీరోలు అక్టోబర్ చివరి వారం షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చారు.

తరుణ్ భాస్కర్ నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా క్రీడా కోలా. నవంబర్ 3న సినిమా విడుదల కానుంది. అక్టోబర్ 29న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. దీనికి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా రానున్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇచ్చారు దర్శక నిర్మాతలు. తరుణ్ తెరకెక్కించిన పెళ్లిచూపులు సినిమాతోనే విజయ్ దేవరకొండ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటినుంచి ఇద్దరు స్నేహం కొనసాగుతూనే ఉంది.

హీరో విక్రమ్ వరుస సినిమాలు ప్రకటిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం పా రంజిత్ దర్శకత్వంలో తంగలాన్ సినిమా చేస్తున్న ఈయన.. ధ్రువ నక్షత్రం సినిమాను దివాళికి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఈ సినిమా ఆరేళ్లుగా వాయిదా పడుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఈ మధ్యే సిద్ధార్థ్‌తో చిన్నా సినిమా తెరకెక్కించిన అరుణ్ కుమార్ దర్శకత్వంలో విక్రమ్ ఒక సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది.

అరడజన్ పైగా సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల.. అన్ని సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయడంలో విఫలమవుతున్నారు. అందుకే కొన్ని సినిమాలు ఇష్టం లేకపోయినా వదులుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నారని తెలుస్తోంది. ఈమె స్థానంలోకి ఏజెంట్ ఫేమ్ సాక్షి వైద్య రాబోతున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది.

చిరంజీవి కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ఖైదీ. ఈ సినిమా విడుదలై నేటికి 40 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఖైదీ సినిమాతో తన జ్ఞాపకాలను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు చిరంజీవి. ఇంత గొప్ప విజయాన్ని తమకు అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు మెగాస్టార్. కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథ, మాటలు అందించారు.




