OG: ట్రెండ్ సెట్ చేసిన OG.. ఇది క్రేజీ ఐడియా గురూ

Edited By: Phani CH

Updated on: Sep 18, 2025 | 8:47 PM

లిరికల్ సాంగ్స్ అందరూ రిలీజ్ చేస్తున్నారు.. అందులో కొత్తేం లేదు.. కానీ అందులోనూ కొత్తగా ఏదో ట్రై చేసినపుడే కదా కిక్ వచ్చేది. ఓజి టీం చేస్తున్నదిదే ఇప్పుడు. ఫైర్ స్ట్రామ్ లిరికల్ నుంచి సుజీత్ ఫాలో అవుతున్న రూట్ అదే. తాజాగా గన్స్ అండ్ రోజెస్‌తో ఆ వాడకం పీక్స్‌కు చేరిపోయింది. మరి ఓజి కోసం సుజీత్ ఫాలో అవుతున్న ఆ రూట్ ఏంటి..?

1 / 5
దేవీ, అనిరుధ్‌తో పోలిస్తే రేసులో ఈ మధ్య కాస్త వెనకబడ్డట్లు కనిపించిన తమన్.. OGతో లెక్కలన్నీ సరి చేస్తున్నారు. ఒక్కోపాట విడుదలవుతుంటే.. సోషల్ మీడియా షేక్ అయిపోతుంది.

2 / 5
తాజాగా విడుదలైన గన్స్ అండ్ రోజెస్ కూడా ట్రెండింగ్‌లోనే ఉంది.. పైగా హంగ్రీ చీతా సాంగ్‌కు ఫుల్ వర్షన్ కావడంతో పండగ చేసుకుంటున్నారు అభిమానులు.ఓజి లిరికల్ సాంగ్స్ కోసం కొత్త ట్రెండ్ సెట్ చేసారు సుజీత్.

3 / 5
మామూలుగా అయితే లిరికల్ సాంగ్స్ అంటే సగం లిరిక్స్.. అక్కడక్కడా మేకింగ్ షాట్స్.. మధ్యలో హీరో హీరోయిన్ విజువల్స్‌తో ఉంటాయి. కానీ ఓజి పాటలన్నీ యానిమేషన్‌లోనే ఉన్నాయి.

4 / 5
మెలోడీగా వచ్చిన సువ్వి సువ్వి సాంగ్ పక్కనబెడితే.. ఫైర్ స్ట్రామ్, ఓమి.. లేటెస్ట్‌గా హంగ్రీ చీతా అన్నింట్లోనూ బొమ్మలే ఉన్నాయి.లిరికల్ సాంగ్స్‌లో ఇదో కొత్త ట్రెండ్. మిగిలిన దర్శకులతో పోలిస్తే ఓజి ప్రమోషన్స్ ముందు నుంచి కాస్త వెరైటీగానే ప్లాన్ చేస్తున్నారు సుజీత్.

5 / 5
అందులో భాగంగానే లిరికల్ సాంగ్స్‌లో ఈ యానిమేషన్ ట్రెండ్. సెప్టెంబర్ 25న ఆకాశమే హద్దుగా విడుదల కానుంది ఓజి. సెప్టెంబర్ 18న ట్రైలర్.. 21న ప్రీ రిలీజ్ వేడుక ప్లాన్ చేస్తున్నారు.