
మూవీ లవర్స్ మాత్రమే కాదు.. మూవీ ఇండస్ట్రీ కూడా కొత్తదనాన్నే కోరుకుంటుందని స్టేట్‌మెంట్ ఇచ్చేశారు నయనతార. సినిమా ఇండస్ట్రీలో రిలేషన్‌షిప్స్ కూడా అలాగే ఉంటాయని చెప్పారు. సినిమా సినిమాకూ టీమ్ మారుతూ ఉంటుంది.

ఓ సినిమాకు కలిసిన వారు, మరో సెట్‌లో కనిపించరు. రిపీటేషన్స్ అరుదుగా ఉంటాయి.. కాబట్టి ఏ రోజుకు ఆ రోజు కొత్త పరిచయాలు ఉంటూనే ఉంటాయంటున్నారు లేడీ సూపర్‌స్టార్.

సెట్లో కలిసి పనిచేసేటప్పుడు పర్సనల్స్ షేర్ చేసుకునే స్పేస్ ఉండదు. అందరి దృష్టి సీన్స్ మీద, షూటింగ్ మీదా ఉంటుంది.. చాలా రేర్‌గా వ్యక్తిగత విషయాలు మాట్లాడుకునే స్పేస్ దొరుకుతుందన్నది నయన్ మనసులో మాట.

వర్క్ స్పేస్‌లో ఫ్రెండ్‌షిప్స్ పెద్దగా వర్కవుట్ కాదన్నది మొదటి నుంచీ నయన్ నమ్మే విషయమట. తన గురించి పూర్తిగా తెలిసిన వారు ఈ లోకంలో ఇద్దరు, ముగ్గురు మాత్రమే ఉంటారంటారు ఈ బ్యూటీ. అలా ఒకరి గురించి ఒకరికి అన్నీ తెలిసి.. అన్ని వేళలా ఒకరికి ఒకరు సపోర్ట్ గా నిలుచోగలరనే నమ్మకం ఉన్నప్పుడే దాన్ని ఫ్రెండ్‌షిప్ అనాలన్నారు నయన్.

సినిమాల్లో ఈ మధ్య కాలంలో రిపీట్ కాంబినేషన్స్ లో నటిస్తున్నారు నయన్. తెలుగులో ఇప్పుడు ఆమె మెగా అనీల్ సినిమాలో నటిస్తున్నారు. తమిళ్, మలయాళంలోనూ చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. వృత్తినీ, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలన్స్ చేసుకోగలిగితే లైఫ్‌లో స్ట్రెస్ అసలు ఉండదన్నది నయన్ గట్టిగా నమ్మే విషయం.