- Telugu News Photo Gallery Cinema photos Naa saami ranga movie actress ashika ranganath latest cute photos
నవ్వుతోనే కట్టిపడేస్తున్న వయ్యారి.. వారెవ్వా అంటున్న నెటిజన్స్
ఆషికా రంగనాథ్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినా అందం, అభినయంతో కట్టిపడేసింది. అలాగే ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. నటించిన రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఆఫర్స్ రావడం లేదు .
Updated on: Oct 30, 2025 | 1:47 PM

ఆషికా రంగనాథ్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినా అందం, అభినయంతో కట్టిపడేసింది. అలాగే ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. నటించిన రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఆఫర్స్ రావడం లేదు.

1996లో కర్ణాటకలో పుట్టిన ఆషికా.. కన్నడ సినీరంగంలోకి అడుగుపెట్టింది. కాలేజీ రోజుల్లోనే మిస్ ఫ్రెష్ ఫేస్ పోటీల్లో పాల్గొ రన్నరప్ గా నిలిచింది. అదే పోటీలో ఆమెను చూసిన దర్శకుడు మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది ఈ భామ.

క్రేజీ బాయ్ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాకే ఉత్తమ నటిగా సైమా అవార్డ్ అందుకుంది. కన్నడలో వరుస ఆఫర్స్ అందుకుని స్టార్ స్టేటస్ అందుకుంది. కానీ తెలుగులోఈ బ్యూటీకి ఆఫర్స్ రావడం లేదు. ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర సినిమాలో నటిస్తుంది ఈ చిన్నది.

స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది ఈ బ్యూటీ. అందరిలా యంగ్ హీరోల పక్కనే కాదు.. సీనియర్ హీరోల సరసన కూడా నటిస్తుంది. నాగార్జున నటించిన నా సామీ రంగ సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ.

అయితే సినిమాల్లో పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం అందాలతో గత్తరలేపుతోంది. గ్లామర్ లుక్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్స్ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.




