- Telugu News Photo Gallery Cinema photos Manchu Lakshmi in bikini in freezing cold, Varun Dhawan gets injured in movie shooting
Tollywood News: ఎముకలు కొరికే చలిలో మంచు లక్ష్మీ.. స్టార్ హీరోకు మళ్ళీ గాయం..
ఫైనల్‌గా సలార్ ప్రమోషన్‌కు సంబంధించి ఓ అప్‌డేట్ ఇచ్చింది మూవీ టీమ్. హీరోలు ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో రాజమౌళి చేసిన ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్ చేసింది. ఫుల్ ఇంటర్వ్యూ డిసెంబర్ 19న రిలీజ్ అవుతుందని వెల్లడించింది. మోస్ట్ అవెయిటెడ్ సలార్ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌కు బ్రేక్ పడటంతో రవితేజ హీరోగా సినిమా స్టార్ట్ చేశారు దర్శకుడు హరీష్ శంకర్. ఇటీవల అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
Updated on: Dec 18, 2023 | 8:55 PM

Salaar: ఫైనల్‌గా సలార్ ప్రమోషన్‌కు సంబంధించి ఓ అప్‌డేట్ ఇచ్చింది మూవీ టీమ్. హీరోలు ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో రాజమౌళి చేసిన ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్ చేసింది. ఫుల్ ఇంటర్వ్యూ డిసెంబర్ 19న రిలీజ్ అవుతుందని వెల్లడించింది. మోస్ట్ అవెయిటెడ్ సలార్ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Mr Bachchan: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌కు బ్రేక్ పడటంతో రవితేజ హీరోగా సినిమా స్టార్ట్ చేశారు దర్శకుడు హరీష్ శంకర్. ఇటీవల అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాకు మిస్టర్ బచ్చన్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. రియల్ లైఫ్‌లో అమితాబ్ బచ్చన్‌కు వీరాభిమాని అయిన రవితేజ, ఈ సినిమాలో బిగ్ బీ ఫ్యాన్స్‌గా నటిస్తున్నారు.

Manchu Lakshmi: గడ్డ కట్టే చలిలో మంచులో ఏర్పాటు చేసిన పూల్‌లో స్నానం చేశారు మంచు లక్ష్మీ. క్రయో థెరపీలో భాగంగా తాను ఈ పని చేసినట్టుగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గతంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ కూడా ఇలాంటి వీడియోలు తమ సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు.

Naa Saami Ranga: నాగార్జున హీరోగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా నా సామి రంగ. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను జనవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేసిన చిత్రయూనిట్ తాజాగా టీజర్‌ను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో నాగ్‌కు జోడిగా ఆశికా రంగనాథ్ నటిస్తున్నారు.

Varun Dhawan: బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మరోసారి గాయపడ్డారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ నిర్మిస్తున్న వీడి 18 షూటింగ్‌లో పాల్గొంటున్న వరుణ్‌కు యాక్షన్ సీన్ చిత్రీకరణలో ప్రమాదం జరిగింది. ఐరన్ రాడ్ తన కాలికి బలంగా తగిలిందని వెల్లడించారు వీడీ. ఇంజురీ తరువాత కూడా నొప్పిని బరిస్తూ షూటింగ్ పూర్తి చేశారు.




