12th Fail: 12th ఫెయిల్ ప్రీక్వెల్ సిద్ధం చేసిన మేకర్స్
బాలీవుడ్ స్క్రీన్ మీద సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా 12th ఫెయిల్. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అందుకే ఆ సక్సెస్ జోష్‌ను మరోసారి క్యాష్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. విక్రాంత్ మెస్సీ, మేధా శంకర్ జంటగా తెరకెక్కిన 12th ఫెయిల్ థియేట్రికల్ రిలీజ్‌లో పర్వాలేదనిపించినా...
Updated on: Nov 17, 2024 | 8:45 PM

బాలీవుడ్ స్క్రీన్ మీద సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా 12th ఫెయిల్. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అందుకే ఆ సక్సెస్ జోష్‌ను మరోసారి క్యాష్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.

విక్రాంత్ మెస్సీ, మేధా శంకర్ జంటగా తెరకెక్కిన 12th ఫెయిల్ థియేట్రికల్ రిలీజ్‌లో పర్వాలేదనిపించినా... డిజిటల్ రిలీజ్ అయిన తరువాత సెన్సేషన్ క్రియేట్ చేసింది. కథా కథనాలతో పాటు నటీనటుల పెర్ఫామెన్స్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. టాప్ స్టార్స్ కూడా సినిమా గురించి ట్వీట్ చేయటంతో 12th ఫెయిల్ సెన్సేషన్‌గా మారింది.

ముంబై సిటీ అడిషనల్ కమీషనర్ మనోజ్ జీవిత కథ ఆధారంగా రాసిన 12th ఫెయిల్ నవలను అదే పేరుతో సినిమాగా రూపొందించారు విధు వినోద్ చోప్రా. డిజిటల్ స్ట్రీమ్‌లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఈ సినిమా, ఐఎండీబీ రేటింగ్స్ విషయంలోనూ అదే రేంజ్ చూపించింది. ఇప్పటికీ ఈ సినిమా 8.8 రేటింగ్‌తో కొనసాగుతోంది.

ఐఎండీబీ రిలీజ్ చేసిన టాప్ 250 సినిమాల లిస్ట్‌లో టాప్ 50లో నిలిచి సత్తా చాటింది. ఈ ఘనత సాధించిన ఏకైక ఇండియన్ సినిమాగా రికార్డ్ సెట్ చేసింది 12th Fail. ఇంత క్రేజ్ వచ్చింది కాబట్టే ఈ సినిమాకు పార్ట్ 2ను ప్లాన్ చేశారు మేకర్స్. మనోజ్ చిన్నతనంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో జీరో సే రీస్టార్ట్ అనే సినిమాను రూపొందించారు.

తాజాగా 12th ఫెయిల్ ప్రీక్వెల్ టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్, సినిమా కంటెంట్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ప్రతీ మనిషి జీవితంలో జీరో మూమెంట్ ఉంటుందని, అందుకే ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుందంటున్నారు మేకర్స్. ఈ మూవీని డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.




