- Telugu News Photo Gallery Cinema photos Do you know how Kamna Jethmalani, who played the heroine in Ranam Movie is Now
వారెవ్వా.. వాటే బ్యూటీ..! రచ్చ లేపుతోన్న రణం హీరోయిన్.. ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే
టాలీవుడ్ లో ఈ బ్యూటీ తక్కువ సినిమాలే చేసింది. రణం సినిమా తర్వాత అల్లరి నరేష్ బెండప్పారావు సినిమాలో నటించింది. ఆతర్వాత ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యింది ఈ చిన్నది.
Updated on: Nov 17, 2024 | 8:40 PM

ఈమధ్య గోపీచంద్ నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. కానీ ఒకప్పుడు ఆయన వరుసగా హిట్స్ అందుకున్నాడు. యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో రణం సినిమా ఒకటి.

ఈ సినిమాలో గోపీచంద్ సరసన కామ్నా జెఠ్మలానీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ తన అందాలతో కుర్రాళ్లను కవ్వించింది. రణం సినిమాతో ఈ చిన్నదాని క్రేజ్ పెరిగిపోయింది. నటనపరంగాను మంచి మార్కులు కొట్టేసింది.

టాలీవుడ్ లో ఈ బ్యూటీ తక్కువ సినిమాలే చేసింది. రణం సినిమా తర్వాత అల్లరి నరేష్ బెండప్పారావు సినిమాలో నటించింది. ఆతర్వాత ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యింది ఈ చిన్నది.

పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. 2014 ఆగస్ట్ 11న బెంగుళూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త సూరజ్ నాగ్ పాల్ ను పెళ్లి చేసుకుంది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీ ఫొటోలతో పాటు తన గ్రామర్స్ ఫోటోలను కూడా పంచుకుంటుంది.

కామ్నా జెఠ్మలానీ ఇప్పుడు చాలా మారిపోయింది అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఆమె అప్పటికీ ఇప్పటికీ అలానే ఉంది. అదే అందం, అదే క్యూట్ నెస్ తో కట్టిపడేస్తుంది. వయసు పెరుగుతున్న తరగని అందంతో కవ్విస్తుంది ఈ భామ.




