Shanvi Srivastava: మరింత అందంగా మారిపోయిన లవ్లీ హీరోయిన్.. శాన్వి లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ఆది హీరోగా వచ్చిన లవ్లీ సినిమా యూత్‌ను బాగా ఆకట్టుకుంది. దివంగత దర్శకురాలు బీఏ జయ తెరకెక్కించిన ఈ యూత్‌ఫుల్ లవ్ స్టోరీలో శాన్వీ శ్రీవాస్తవ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో తన అందానికి, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి.
Updated on: Aug 12, 2023 | 7:56 AM

ఆది హీరోగా వచ్చిన లవ్లీ సినిమా యూత్‌ను బాగా ఆకట్టుకుంది. దివంగత దర్శకురాలు బీఏ జయ తెరకెక్కించిన ఈ యూత్‌ఫుల్ లవ్ స్టోరీలో శాన్వీ శ్రీవాస్తవ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో తన అందానికి, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి.

లవ్లీ తర్వాత సుశాంత్‌తో కలిసి అడ్డా, విష్ణుతో కలిసి రౌడీ, ఆదితో కలిసి ప్యార్ మే పడిపోయానే సినిమాల్లో నటించింది శాన్వి. అయితే ఈ సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో తెలుగులో శాన్వికి ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి.

దీంతో కన్నడ సినిమా ఇండస్ట్రీకి వెళ్లిపోయిందీ అందాల తార. అక్కడ బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె నటించిన అతడే శ్రీమన్నారాయణ వంటి సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి.

ప్రస్తుతం బ్యాంగ్ అనే సినిమాలో నటిస్తోంది శాన్వి. ఈ సినిమాలో డాన్‌గా నటిస్తోందీ అందాల తార. ఆగస్ట్ 18న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా 'బ్యాంగ్' సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. డాన్ అవతార్‌లో షాన్వి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

కాగా బ్యాంగ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో శాన్వి ఎంతో అందంగా కనిపించింది. ప్రస్తుతం ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శాన్వికి ఇన్‌స్టాగ్రామ్‌లో 14 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన కొత్త సినిమా విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.




