Kriti Sanon: వరసగా ఏడో డిజాస్టర్ తో ట్రెండింగ్ లో ముద్దుగుమ్మ
జాతీయ ఉత్తమ నటి ఆమె..! అలాంటి హీరోయిన్‌తో సినిమా అంటే మేకర్స్ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్‌లో జరుగుతుంది. జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నా.. ఆమెతో సినిమా అంటే బెదిరిపోతున్నారు దర్శక నిర్మాతలు. ఇంతకీ ఎవరా నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్..? ఆమెతో సినిమా అంటే ఎందుకు భయపడుతున్నారు..? కృతి సనన్.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. ఎందుకంటే తెలుగులో ఒకట్రెండు సినిమాలు మాత్రమే చేసినా.. హిందీలో మాత్రం వరస ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతున్నారీమే.
Updated on: Oct 23, 2023 | 9:58 AM

జాతీయ ఉత్తమ నటి ఆమె..! అలాంటి హీరోయిన్‌తో సినిమా అంటే మేకర్స్ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్‌లో జరుగుతుంది. జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నా.. ఆమెతో సినిమా అంటే బెదిరిపోతున్నారు దర్శక నిర్మాతలు. ఇంతకీ ఎవరా నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్..? ఆమెతో సినిమా అంటే ఎందుకు భయపడుతున్నారు..?

కృతి సనన్.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. ఎందుకంటే తెలుగులో ఒకట్రెండు సినిమాలు మాత్రమే చేసినా.. హిందీలో మాత్రం వరస ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతున్నారీమే. పైగా మిమి సినిమాకు గానూ నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు కృతి. దాంతో ఈ భామ రేంజ్ మరింత పెరిగింది. కానీ కెరీర్ మాత్రం దారుణంగా ఉంది. వరసగా 7 ఫ్లాపులతో ఐరెన్ లెగ్ అయిపోయారు కృతి.

రెండు మూడేళ్లుగా కృతి సనన్ టైమ్ అస్సలు బాగోలేదు. మిమి తర్వాత ఈమెకు చెప్పుకోదగ్గ విజయమే రాలేదు. తాజాగా టైగర్ ష్రాఫ్‌తో నటించిన గణపత్ కూడా దారుణంగా బోల్తా కొట్టింది. తొలిరోజే ఈ సినిమాకు కనీస ఓపెనింగ్స్ రాలేదు. దాంతో డిజాస్టర్ లిస్ట్‌లో చేరిపోయింది గణపత్. దీనికి ముందు ఆదిపురుష్, షెహ్‌జాదా కూడా ఇదే ఫలితాన్ని అందుకున్నాయి.

2023లో హ్యాట్రిక్ ఫ్లాప్స్ ఇచ్చిన కృతికి 2022 కూడా కలిసిరాలేదు. గతేడాది ఈమె నటించిన భేడియా, బచ్చన్ పాండే, పానిపట్, అర్జున్ పటియాలా కూడా ఫ్లాపులే. వీటిలో ఏ ఒక్కటి కనీసం యావరేజ్ స్టేటస్ కూడా అందుకోలేదు.

స్టోరీ సెలక్షన్‌లో కృతి సనన్‌కు ఏ మాత్రం ధ్యాస ఉండదని.. కేవలం రెమ్యునరేషన్‌పైనే ఫోకస్ అంటూ ఈమెపై విమర్శలు మొదలయ్యాయి. మరి ఇకపై ఏం చేస్తారో చూడాలి.




