
తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. ఇటీవలే తమిళంలో ఆమె నటించిన చిన్న సినిమా బాక్సాఫీల్ వద్ద సంచలనం సృష్టించింది. దీంతో ఈ అమ్మడు పేరు మారుమోగింది. అయినప్పటికీ తెలుగులో మాత్రం ఆఫర్స్ నిల్లు.

ఈ హీరోయిన్ పేరు శాన్వీ మేఘన. 1998 సెప్టెంబర్ 12న హైదరాబాద్ లో జన్మించిన శాన్వీ మేఘన.. 2019లో సైరా నరసింహా రెడ్డి సినిమాతో సినీప్రయాణం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత పిట్ట కథలు, బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్, పుష్పక విమానం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాల్లో నటించింది.

పుష్పక విమానం సినిమాలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. తెలుగులో మొత్తం ఆరు సినిమాల్లో నటించింది. అన్నీ సూపర్ హిట్సే. కానీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో ఆఫర్స్ మాత్రం రాలేదు. దీంతో కోలీవుడ్ షిఫ్ట్ అయిన ఈ అమ్మడు అవకాశాలు అందుకుంది.

ఇటీవలే కోలీవుడ్ నటుడు మణికందన్ జోడిగా ఆమె నటించిన కుటుంబస్థాన్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ అమ్మడు పేరు మారుమోగింది. కానీ తెలుగులో ఆశించిన స్థాయిలో ఆఫర్స్ మాత్రం రాలేదు.

తెలుగులో చివరగా టుక్ టుక్ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ మరో మూవీ అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోషూట్లతో మెంటలెక్కిస్తుంది ఈ వయ్యారి.