- Telugu News Photo Gallery Cinema photos Know This Actress Did Movies With Pawan Kalyan and Allu Arjun, Didn't Get Single Hit, She Is Anu Emmanuel
Tollywood: పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్లతో సినిమాలు చేసింది.. ఒక్క హిట్టు అందుకోని బ్యూటీ.. చివరకు ఇలా..
సినీరంగంలో అందం, అభినయంతో మెప్పించిన ముద్దుగుమ్మ.. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీ నుంచి మాయమవుతుంటారు. స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ అదృష్టం కలిసిరాక.. వరుసగా ప్లాప్స్ అందుకుంటారు. దీంతో నెమ్మదిగా ఆఫర్స్ తగ్గిపోవడంతో సినిమాలకు దూరంగా ఉండిపోతారు. అలాంటివారిలో ఈ అమ్మడు ఒకరు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.
Updated on: Apr 11, 2025 | 11:13 AM

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్.. తెలుగులో వరుస సినిమాలతో అలరించింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాని సరసన నటించి మెప్పించింది. కానీ ఇప్పటివరకు ఒక్క హిట్టు కూడా అందుకోలేకపోయింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

ఆ హాట్ బ్యూటీ ఎవరో కాదండోయ్.. న్యాచురల్ స్టార్ నాని నటించిన మజ్ను సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది అను ఇమ్మాన్యుయేల్. మొదటి సినిమాతోనే కుర్రకారును కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్స్ వచ్చాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమాతోపాటు.. అల్లు అర్జున్ సరసన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీలో నటించింది. ఈ చిత్రాలు ప్లాప్ కావడంతో ఈ అమ్మడుకు అంతగా క్రేజ్ రాలేదు.

తెలుగులో కిట్టు ఉన్నాడు జాగ్ర్తత, ఆక్సిజన్, శైలజారెడ్డి అల్లుడు, అల్లుడు అదుర్స్, ఊర్వశివో రాక్షసివో సినిమాల్లో నటించినప్పటికీ కెరీర్ మొత్తంలో వరుస ప్లాప్స్ ఎదురయ్యాయి. తెలుగులోతాపుట తమిళలోనూ నటించినప్పటికీ సరైన హిట్టు రాలేదు.

వరుస సినిమాలు ప్లాప్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ తగ్గిపోయాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు అందాలు ఆరోబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. నెట్టింట మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ సరైన హిట్టు మాత్రం రాలేదు.




