ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన సినిమా ‘దీపావళి’. RA వెంకట్ ఈ సినిమాకు దర్శకుడు. పూ రాము, కాళీ వెంకట్ ఇందులో కీలక పాత్రల్లో నటించారు. ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’కు తెలుగు అనువాదం ఈ ‘దీపావళి’. ఈ సినిమా పలు జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రశంసలు అందుకుంది. నవంబర్ 11న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. తాజాగా రామ్ పోతినేని ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసారు.