
శ్రీలీలను చూసి ఇప్పుడిదే అడుగుతున్నారు ఫ్యాన్స్ కూడా.. బాలీవుడ్‌కు వెళ్లగానే వాట్స్ హ్యాపెనింగ్..? ఈ రూమర్స్ ఏంటి అని..! తెలుగు ఇండస్ట్రీలో రెండేళ్లు వరస సినిమాలు చేసినా కూడా ఒక్క రూమర్ కూడా రాలేదు ఈ బ్యూటీపై.

కానీ అలా ముంబై వెళ్లిందో లేదో.. అప్పుడే ఓ హీరోతో ఈమె డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. తెలుగులో నితిన్ రాబిన్ హుడ్.. రవితేజ మాస్ జాతర సినిమాలతో బిజీగా ఉన్నారు శ్రీలీల.

దీంతో పాటు తమిళంలో శివకార్తికేయన్‌తో పరాశక్తి సినిమా చేస్తున్నారు. ఈ మధ్యే కార్తీక్ ఆర్యన్‌తో ఓ సినిమాకు కమిటయ్యారు శ్రీలీల. ఈ సినిమాతోనే బాలీవుడ్‌లో అడుగు పెడుతున్నారీ బ్యూటీ. డెబ్యూ సినిమా హీరోతోనే శ్రీలీల డేట్ చేస్తుందంటూ ప్రచారం మొదలైందిప్పుడు.

ఈ మధ్యే జరిగిన ఐఫా వేడుకల్లో నిర్మాత కరణ్ జోహార్ అడిగిన ఒక ప్రశ్నతో ఇదంతా మొదలైంది. మీకు కాబోయే కోడలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారంటూ కార్తిక్ ఆర్యన్ అమ్మను అడిగారు కరణ్. దానికి ఆమె డాక్టర్ ఐతే బాగుంటుందన్నారు.. అంతే ఆ ఒక్క మాటతో కార్తిక్ ఆర్యన్, శ్రీలీల మధ్య ఏదో ఉందంటూ బాలీవుడ్ మీడియా కథనాలు అల్లేసింది.

శ్రీలీల కూడా డాక్టర్ కమ్ యాక్టర్ కాబట్టి.. కార్తిక్ ఆర్యన్, శ్రీలీల డేటింగ్‌లో ఉన్నారంటూ రూమర్స్ మొదలయ్యాయి. అయితే ఆ డౌట్ అప్పుడే అక్కడే తీర్చేసారు ఈ హీరో. ఇంట్లో వాళ్లు కోరుకున్నది హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ అని.. సినిమాల్లో నటించే డాక్టర్ కాదంటూ క్లారిటీ ఇచ్చారు కార్తిక్. దాంతో గాసిప్స్‌కు ఫుల్ స్టాప్ పడింది.