- Telugu News Photo Gallery Cinema photos Kannappa actress preity mukhundhan shared her latest beautiful photos
Preity Mukhundhan: కన్నప్ప హీరోయిన్ అందాలతో అదరగొట్టేసిందిగా..! ప్రీతి ముకుందన్ లేటెస్ట్ పిక్స్
టాలీవుడ్ ను కొత్త అందాలు పలకరిస్తున్నాయి. కొత్త హీరోయిన్స్ చాలా మంది తన అందంతో నటనతో ఆకట్టుకుంటున్నారు. అలా టాలీవుడ్ కు పరిచయమైన భామే ప్రీతి ముకుందన్. ఈ చిన్నది ఇటీవలే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో నటిస్తుంది.
Updated on: Jun 16, 2025 | 2:02 PM

టాలీవుడ్ ను కొత్త అందాలు పలకరిస్తున్నాయి. కొత్త హీరోయిన్స్ చాలా మంది తన అందంతో నటనతో ఆకట్టుకుంటున్నారు. అలా టాలీవుడ్ కు పరిచయమైన భామే ప్రీతి ముకుందన్. ఈ చిన్నది ఇటీవలే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో నటిస్తుంది.

ప్రీతి ముకుందన్ టీవీ షోలో నృత్య ప్రదర్శనలతో తన కెరీర్ ను ప్రారంభించింది. అందాల భామ ప్రీతి ముకుందన్ మొదటి మ్యూజిక్ ఆల్బమ్ ‘ముత్తు ము2’ యూట్యూబ్ లో 4.2 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి పేరొందినది. ఆతర్వాత ఈ చిన్నదానికి సినిమా ఆఫర్స్ వచ్చాయి.

శ్రీవిష్ణు సరసన ‘ఓం భీమ్ బుష్’ సినిమాతో హీరోయిన్ గా మారింది.‘ఓం భీమ్ బుష్’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో ప్రీతి ముకుందన్ అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు కన్నప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

మంచు విష్ణు తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమాతో మరోసారి ప్రేక్షకులను కవ్వించనుంది ప్రీతి ముకుందన్మంచు. కన్నప్ప సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొన్నామధ్య కన్నప్ప సినిమాలో నెమలి పాత్రలో ప్రీతి ముకుందన్ నటిస్తుందని అనౌన్స్ చేస్తూ ఓ అందమైన పోస్టర్ వదిలారు.

సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తుంది ఈ చిన్నది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు చుస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. ఈ ఫొటోలకు కుర్రాళ్ళు రొమాంటిక్ కామెంట్స్ చేస్తున్నారు.




