Kalki 2: కల్కి 2పై క్లారిటీ.. పాపం ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలన్నీ.. నిరాశలేనా..

Edited By: Phani CH

Updated on: Sep 02, 2025 | 8:06 PM

కల్కి 2 ఎప్పుడు.. షూటింగ్ ఎప్పట్నుంచి మొదలు కాబోతుంది.. ఎప్పుడు విడుదల కాబోతుంది..? ప్రభాస్ ఫ్యాన్స్ మదిలో ఉన్న బేసిక్ క్వశ్చన్స్ ఇవి. దీనికి ఒక్కొక్కరు ఒక్కోలా సమాధానం చెప్తున్నారు. మరి కెప్టెన్ మాటేంటి..? అసలు కల్కి 2 మీద నాగ్ అశ్విన్ ఏమంటున్నారు..? షూటింగ్ ఎప్పుడు మొదలు కానుంది..? అసలు ఇప్పట్లో అవుతుందా లేదా..?

1 / 5
ప్రభాస్‌తో సినిమా చేయాలంటే దర్శకుడి దగ్గర ఉండాల్సిందిప్పుడు కథ కాదు.. ఓపిక. ఆయనతో సినిమా అంటే టోకన్ సిస్టమ్ అన్నట్లే..! మీ నెంబర్ వచ్చేవరకు వెయిట్ చేయడం తప్ప చేసేదేం లేదు.

2 / 5
మూడు నాలుగేళ్లకు సరిపోయే ప్రాజెక్ట్స్ అన్నీ సెట్ చేసుకున్నారు రెబల్ స్టార్.. దాంతో దర్శకుల్లో వాళ్లలో వాళ్లకు ఈ పోటీ తప్పట్లేదు. ఒకేసారి రెండు సినిమాలు చేయడం అలవాటు చేసుకున్నారు ప్రభాస్. ఇప్పుడు కూడా ఓ వైపు రాజాసాబ్.. మరోవైపు హను రాఘవపూడి సినిమాలు చేస్తున్నారు.

3 / 5
వీటి తర్వాత స్పిరిట్‌తో సందీప్ వంగా స్క్రిప్ట్ పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. అన్నీ కుదిర్తే అక్టోబర్ నుంచే ఈ చిత్రం సెట్స్‌పైకి రానుంది. అదే నెలలో బాహుబలి ది ఎపిక్ కూడా విడుదల కానుంది.

4 / 5
స్పిరిట్ తర్వాత కల్కి 2, సలార్ 2 ఉంటాయి.. వీటిలో కల్కి 2పై క్లారిటీ ఇచ్చారు నాగ్ అశ్విన్. డిసెంబర్ నుంచి షూట్ స్టార్ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు నాగీ. కాకపోతే కల్కి 2లో చాలా భాషల నటులన్నారని.. అందరి డేట్స్ కుదిరినపుడే సినిమా సెట్స్‌పైకి తీసుకొస్తామంటున్నారు ఈ దర్శకుడు. రిలీజ్ డేట్ ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేమంటున్నారు నాగ్ అశ్విన్.

5 / 5
డేట్స్ దొరికితే షూటింగ్ తక్కువ సమయంలోనే అయిపోతుందని.. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కోసం మాత్రం చాలా టైమ్ పడుతుందంటున్నారు నాగ్ అశ్విన్. మరో రెండేళ్లలో ఈ సినిమాను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానన్నారు కానీ కచ్చితంగా మాత్రం చెప్పలేకపోతున్నారీయన. ఈ లెక్కన కల్కి 2 రిలీజ్ ఏ 2027లోనో, 2028లోనో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.