Janhvi Kapoor: సౌత్ లో ప్రయోగాలు చేస్తున్న జాన్వీ కపూర్
ప్రజెంట్ సౌత్ మీద ఫోకస్ చేస్తున్న జాన్వీ కపూర్, నార్త్‌లో ఇంత వరకు చేయని ప్రయోగాలు దక్షిణాదిలో చేసేందుకు రెడీ అవుతున్నారు. నార్త్‌లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ అన్న ట్యాగ్ మాత్రం పొందలేకపోయారు. అందుకే సౌత్‌లో ఆ క్రెడిట్ కోసం కష్టపడుతున్నారు జాన్వీ. త్వరలో దేవరకు జోడిగా సౌత్ ఆడియన్స్‌ను పలకరించబోతున్నారు జూనియర్ శ్రీదేవి జాన్వీ కపూర్.
Updated on: Aug 20, 2024 | 5:54 PM

ప్రజెంట్ సౌత్ మీద ఫోకస్ చేస్తున్న జాన్వీ కపూర్, నార్త్‌లో ఇంత వరకు చేయని ప్రయోగాలు దక్షిణాదిలో చేసేందుకు రెడీ అవుతున్నారు. నార్త్‌లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ అన్న ట్యాగ్ మాత్రం పొందలేకపోయారు.

అందుకే సౌత్‌లో ఆ క్రెడిట్ కోసం కష్టపడుతున్నారు జాన్వీ. త్వరలో దేవరకు జోడిగా సౌత్ ఆడియన్స్‌ను పలకరించబోతున్నారు జూనియర్ శ్రీదేవి జాన్వీ కపూర్. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా డిఫరెంట్ రోల్ ప్లే చేస్తున్నారు.

విలేజ్ గర్ల్ క్యారెక్టరే అయినా గ్లామర్ యాంగిల్ మాత్రం మిస్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. దేవర సెట్స్ మీద ఉండగానే రామ్ చరణ్‌కు జోడీగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ బ్యూటీ.

బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో జాన్వీ లుక్‌కు సంబంధించిన న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. ఆర్సీ 16లో జాన్వీ డీ గ్లామరస్ లుక్‌లో కనిపించబోతున్నారట.

ఆల్రెడీ లుక్ టెస్ట్ కూడా పూర్తి చేసిన బుచ్చిబాబు, ఆడియన్స్‌కు షాక్ ఇచ్చే రేంజ్‌లో జాన్వీ గెటప్‌ను ప్లాన్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలతో సౌత్‌లో సెటిల్ అవ్వటమే కాదు, పాన్ ఇండియా రేంజ్‌లో స్టార్ హీరోయిన్ ట్యాగ్ సాధించేందుకు కష్టపడుతున్నారు జాన్వీ కపూర్.




