- Telugu News Photo Gallery Cinema photos Is this the movie Balakrishna starred in despite knowing it would be a disaster?
డిజాస్టర్ అవుతుందని తెలిసినా బాలకృష్ణ నటించిన సినిమా ఏదో తెలుసా?
నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ హీరో సినిమా వస్తుందంటే చాలు థియేటర్స్ వద్ద ఉండే సందడే వేరుంటుంది. బాలయ్య తన కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో, విభిన్న పాత్రల్లో నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. అందుకే అప్పటి వారికే కాకుండా ఇప్పటి వారికి కూడా బాలయ్య అంటే చాలా ఇష్టం అయితే.
Updated on: Mar 21, 2025 | 2:16 PM

ఇక ఈ మధ్య బాలకృష్ణ వరస సినిమాలతో, బ్లాక్ బస్టర్ హిట్స్‌తో దూసుకెళ్తున్నాడు. తాజాగా డాకు మహారాజ్ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ క్రమంలో బాలయ్యకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అది ఏమిటంటే. ఏ హీరోనైనా సరే హిట్ కథను ఎంచుకొని ఆ సినిమానే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.

కానీ బాలయ్య మాత్రం కథన నచ్చకపోయినా, ఒక సినిమా డిజాస్టర్ అవుతుందని తెలిసినా కూడా సినిమా చేసి, ఊహించని డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడంట. ఇంతకీ అది ఏ సినిమా అంటే?

దర్శకుడు కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తిరుగబడ్డ తెలుగు బిడ్డ అనే సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా కథ బాగలేకపోవడమే కాకుండా సినిమా డిజాస్టర్ అవుతుందని డైరెక్టర్, బాలయ్య అనుకొని, సినిమా అపేద్దాం అనుకున్నారంట.

కానీ సీనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాను తప్పకుండా తీయాల్సిందేనని పట్టుపట్టడంతో చేసేది ఏం లేక సినిమా తీశారంట. అంతే కాకుండా ఇష్టం లేకపోయినా బాలకృష్ణ ఈ మూవీలో నటించి తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్ట్ అందుకున్నాడంట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.





























