
బాలీవుడ్‌లో స్పై యూనివర్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 13 ఏళ్ళ కింద సల్మాన్ ఖాన్ ఏక్ తా టైగర్‌తో మొదలైంది ఈ యూనివర్స్. ఆ తర్వాత అదే సిరీస్‌లో వచ్చిన టైగర్ జిందా హై బ్లాక్‌బస్టర్ అయింది.

ఇక షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన పఠాన్ ఏకంగా 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. వార్ సినిమా సైతం స్పై యూనివర్స్‌లో భాగంగానే వచ్చింది.. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన ఈ సినిమా 2019లో విడుదలైంది.

పఠాన్ వరకు స్పై సినిమాలకు తిరుగులేదు.. కానీ సల్మాన్ ఖాన్ టైగర్ 3 నుంచి వార్నింగ్ బెల్స్ మోగాయి. ఫైటర్ సైతం అంచనాలు అందుకోలేదు. అన్ని సినిమాల్లోనూ ఒకే కథ ఉండటంతో ప్రేక్షకులు కూడా బోర్ ఫీల్ అవుతున్నారు.

వార్ 2లోనూ కొత్త కథ ఏమీ ఉండదని ముందు నుంచే ఊహించారు ఆడియన్స్. వాళ్ల అంచనాలు తప్పు కాలేదు.. మళ్లీ అలాంటి కథతోనే వచ్చింది వార్ 2. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ ఉన్నారు కాబట్టి ఓపెనింగ్స్ వరకు రప్ఫాడించింది వార్ 2. కానీ అసలు పరీక్ష వచ్చేసరికి చేతులెత్తేసింది. చాలా రోజుల తర్వాత తారక్ నిరాశ పరిచిన సినిమా ఇది.

వార్ 2 విడుదలకు ముందే స్పై సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని ప్లాన్ చేసింది యష్ రాజ్ ఫిల్మ్స్. ఈ క్రమంలోనే షారుఖ్, సల్మాన్ హీరోలుగా ప్లాన్ చేసిన టైగర్ Vs పఠాన్ ఆలోచన మానుకున్నారు. ఇదే జరిగితే స్పై సినిమాల్లో వార్ 2 చివరిది అవుతుంది. అలియా భట్‌తో ఆల్ఫా అనే లేడీ ఓరియెంటెడ్ స్పై సినిమా నిర్మిస్తుంది YRF. దీని తర్వాత స్పై సినిమాలు ఇక ఉండకపోవచ్చు.