Box Office: మ్యాచ్ పోయే.. వందల కోట్లు పోయే.. బాక్సాఫీస్ మునిగిపోయే..!
వ్రతం చెడ్డా ఫలితం దక్కుంటే బాగుండేది కానీ అదీ ఇదీ రెండూ దక్కలేదు. అదే ఇప్పుడు అందరి బాధ కూడా. మనోళ్లు వరల్డ్ కప్‌లో ఆడిన తీరు చూసి కచ్చితంగా ఆస్ట్రేలియాను తొక్కేస్తారు.. కప్పు పట్టేస్తారని కలలు కన్నారు. ఎక్కడో 2003 భయాలున్నా.. ఈసారి ఇండియన్ టీం ఉన్న ఫామ్ చూసాక.. ఆసీస్ అయినా తగ్గేదే లే అంటారేమో అనుకున్నారు. కానీ అదేం జరగలేదు. 2003 సీన్ మళ్లీ రిపీట్ అయింది. ఆస్ట్రేలియా ఆరోసారి కప్పు ఎగరేసుకుపోయింది. మనింటికి వచ్చి.. మనోళ్లనే కొట్టి మరీ ప్రపంచ కప్పును తీసుకెళ్లింది. దాంతో కోట్లాది మంది అభిమానులు బాధలోంచి బయటికి రాలేకపోతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
