- Telugu News Photo Gallery Cinema photos Tollywood movies which was shooting at forest will impressing the Indian audience
Forest Back Drop: అడవుల బాట పట్టిన టాలీవుడ్.. ఇండియన్ ఆడియన్స్ ను మెప్పించనున్నారా..
టాలీవుడ్‌కి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ఈ మధ్య కాలంలో బాగానే కలిసొస్తోంది. ట్రిపుల్ ఆర్, పుష్ప2 సినిమాల సక్సెస్ చూసిన తర్వాత గ్రీనరీ మీద మనసు పారేసుకున్నారు మేకర్స్. అందుకే కాస్త బడ్జెట్ పెరిగినా ఫర్వాలేదని, పచ్చటి అడవుల్లో పర్ఫెక్ట్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు. అసలు తగ్గేదేలే అంటూ శేషాచలం అడవుల్లో పుష్పరాజ్ చేసిన వీరవిహారాన్ని పుష్ప2లో చూసి తీరాల్సిందే. సంక్రాంతి రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈగల్ టీజర్ చూశారా? స్టార్ హీరోలు ఎన్టీఆర్, మహేష్ కూడా అడవుల బాట పట్టడానికి సిద్ధమవుతున్నారు.
Updated on: Nov 22, 2023 | 10:17 AM

టాలీవుడ్‌కి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ఈ మధ్య కాలంలో బాగానే కలిసొస్తోంది. ట్రిపుల్ ఆర్, పుష్ప2 సినిమాల సక్సెస్ చూసిన తర్వాత గ్రీనరీ మీద మనసు పారేసుకున్నారు మేకర్స్. అందుకే కాస్త బడ్జెట్ పెరిగినా ఫర్వాలేదని, పచ్చటి అడవుల్లో పర్ఫెక్ట్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు.

అసలు తగ్గేదేలే అంటూ శేషాచలం అడవుల్లో పుష్పరాజ్ చేసిన వీరవిహారాన్ని పుష్ప2లో చూసి తీరాల్సిందే. స్వచ్ఛమైన చిత్తూరు యాసలో, పచ్చ పచ్చాటి అడవుల్లో బన్నీ చెలరేగిపోతుంటే చూడ్డానికి ముచ్చటగా ఉంటుందంటూ మురిసిపోతున్నారు ప్యాన్ ఇండియన్ ఆడియన్స్. వాళ్ల ముచ్చటను తీర్చడానికి బడ్జెట్‌లో రూపాయి ఎక్కువైనా ఫర్వాలేదు, నో కాంప్రమైజ్ అంటూ ముందుకు సాగుతున్నారు మేకర్స్.

సంక్రాంతి రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈగల్ టీజర్ చూశారా? ఈ సినిమాలో హీరోకి అడవితో అనుబంధం ఉందనే విషయం స్పష్టమవుతుంది. ఆ సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న భక్త కన్నప్ప సినిమా షూటింగ్ న్యూజిల్యాండ్‌లో జరుగుతోంది. స్వచ్ఛమైన ఆకాశం, కాలుష్య రహిత పరిసరాల కోసం అక్కడి అడవుల్లో చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఇటు నితిన్ హీరోగా రూపొందుతున్న ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ షెడ్యూల్స్ కూడా మారేడిమిల్లి ఫారెస్టులో జరిగాయి.

స్టార్ హీరోలు ఎన్టీఆర్, మహేష్ కూడా అడవుల బాట పట్టడానికి సిద్ధమవుతున్నారు. దేవర2 కోసం తారక్, రాజమౌళి సినిమా కోసం మహేష్, నియర్ ఫ్యూచర్‌లో అడవుల్లో షూటింగ్ చేస్తారన్నది ఫ్యాన్స్ కి ఊరిస్తున్న విషయం.




