- Telugu News Photo Gallery Cinema photos Icon Star Allu Arjun in Pushpa 2 Movie with 400 members junior artists and 100 members dancers Update Telugu Heros Photos
Allu Arjun: అదిరిందయ్యా బన్నీ.! అభిమానుల కంప్లైంట్ పుష్ప2 తో తీరుస్తున్న అల్లు అర్జున్.
అల్లు అర్జున్ అంటేనే డాన్సులు.. ఆయన పేరు మీదే ఎన్నో హుక్ స్టెప్స్ ఉన్నాయి. అలాంటి హీరో సినిమాలో డాన్సుల్లేవనేది కొన్నేళ్లుగా అభిమానుల నుంచి వస్తున్న కంప్లైంట్. వినడానికి విచిత్రంగా.. నమ్మడానికి కష్టంగా అనిపించినా ఇదే నిజం. మరి ఈ కంప్లైంట్‌ని బన్నీ ఎలా తీసుకుంటున్నారు..? పుష్ప 2లో లెక్కలు సరి చేస్తారా..? అసలు అల్లు అర్జున్ ప్లాన్ ఏంటి..? తెలుగు ఇండస్ట్రీలో ఈ జనరేషన్ హీరోలలో బెస్ట్ డాన్సర్ ఎవరంటే అల్లు అర్జున్ పేరు ముందు వరసలో ఉంటుంది.
Updated on: Nov 10, 2023 | 2:58 PM

అల్లు అర్జున్ అంటేనే డాన్సులు.. ఆయన పేరు మీదే ఎన్నో హుక్ స్టెప్స్ ఉన్నాయి. అలాంటి హీరో సినిమాలో డాన్సుల్లేవనేది కొన్నేళ్లుగా అభిమానుల నుంచి వస్తున్న కంప్లైంట్. వినడానికి విచిత్రంగా.. నమ్మడానికి కష్టంగా అనిపించినా ఇదే నిజం.

మరి ఈ కంప్లైంట్‌ని బన్నీ ఎలా తీసుకుంటున్నారు..? పుష్ప 2లో లెక్కలు సరి చేస్తారా..? అసలు అల్లు అర్జున్ ప్లాన్ ఏంటి..? తెలుగు ఇండస్ట్రీలో ఈ జనరేషన్ హీరోలలో బెస్ట్ డాన్సర్ ఎవరంటే అల్లు అర్జున్ పేరు ముందు వరసలో ఉంటుంది.

ప్రతీ సినిమాలోనూ ఒళ్లు హూనం చేసుకుంటూ స్టెప్పులేస్తుంటారు బన్నీ. కానీ డిజే నుంచి ఈయన శైలి మారింది. స్టైలిష్‌గా స్టెప్స్ వేస్తున్నారు కానీ ఒకప్పట్లా ఫ్లోర్ మూవెంట్స్‌కు దూరంగా ఉన్నారు బన్నీ.

అల వైకుంఠపురములో, పుష్పలోనూ అదే కంటిన్యూ చేసారీయన. కంటెంట్‌పై ఫోకస్‌తో డాన్సుల్ని పక్కన పెట్టేసారు బన్నీ. బీట్ ఎంత ఫాస్ట్‌గా ఉన్నా.. గ్రేస్‌తోనే వాటిని కవర్ చేస్తున్నారు అల్లు అర్జున్.

కానీ పుష్ప 2తో అన్ని లెక్కలు ఒకేసారి తీర్చేస్తానంటున్నారీయన. మునపటి ఊపు తీసుకొచ్చేలా కొరియోగ్రఫర్స్‌కు తన వైపు నుంచి సిగ్నల్స్ వెళ్తున్నాయి. అంతేకాదు.. ఫస్ట్ పార్ట్‌లో మిస్ అయిన ప్రతీ విషయంపై సీక్వెల్‌లో ఫోకస్ చేస్తున్నారు బన్నీ.

పుష్ప 2 భారీ షెడ్యూల్ తాజాగా మొదలైంది. 40 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ సాంగ్‌తో మొదలైంది. గణేష్ ఆచార్య కొరియోగ్రఫరీలో జాతర గెటప్స్‌తో దాదాపు 400 మంది జూనియర్లు, 100 మంది పైగా డాన్సర్లతో షూట్ చేస్తున్నారు.

పుష్ప 2లో బన్నీ డాన్స్ జాతర చూడబోతున్నారని తెలుస్తుంది. మరోసారి ఆ సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగేలా చేస్తోంది. ఈ న్యూస్ ఇప్పడు నెట్టింట ట్రెండ్ అవుతోంది.




