- Telugu News Photo Gallery Cinema photos Icon Star Allu Arjun avoiding with Atlee Film Telugu Entertainment Photos
Allu Arjun – Atlee: జవాన్ డైరెక్టర్ అట్లీని పక్కకు పెట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..
జవాన్ సినిమాతో.. ఒక్కాసారిగా పాన్ ఇండియన్ డైరెక్టర్ల లిస్టులోకి ఎక్కిన యంగ్ డైరెక్టర్ అట్లీ.. ఎట్ ప్రజెంట్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను సెట్ చేసుకునేందుకు తెగ కష్టపడతున్నారట. ఓ పక్క జవాన్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే.. మరో పక్క ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను డైరెక్టర్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. అందుకోసం ఇప్పటికే ఓ స్టోరీని రెడీ చేసుకుని.. ఈ స్టార్ హీరో చుట్టు తిరుగుతున్నారట.
Updated on: Sep 08, 2023 | 9:08 PM

జవాన్ సినిమాతో.. ఒక్కాసారిగా పాన్ ఇండియన్ డైరెక్టర్ల లిస్టులోకి ఎక్కిన యంగ్ డైరెక్టర్ అట్లీ.. ఎట్ ప్రజెంట్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను సెట్ చేసుకునేందుకు తెగ కష్టపడతున్నారట.

ఓ పక్క జవాన్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే.. మరో పక్క ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను డైరెక్టర్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. అందుకోసం ఇప్పటికే ఓ స్టోరీని రెడీ చేసుకుని.. ఈ స్టార్ హీరో చుట్టు తిరుగుతున్నారట.

అయితే ఇప్పుడిదే న్యూస్.. అటు కోలీవుడ్‌లోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ తెగ ట్రెండ్ అవుతోంది. టాలీవుడ్ లోనూ.. రీసౌండ్ చేస్తోంది. పుష్ప పాన్ ఇండియన్ సినిమా హిట్‌తో.. ఆలోవర్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్..

తాజాగా పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే ఇటీవల అల్లు అర్జున్ ను కలిసిన జవాన్ డైరెక్టర్ అట్లీ.. ఈ ఐకాన్ స్టార్ కు ఓ క్రేజీ స్టోరీ లైన్ చెప్పారట. తన స్టోరీ టెల్లింగ్‌తో.. కాన్సెప్ట్‌తో అల్లు అర్జున్‌ను విపరీతంగా ఇంప్రెస్ కూడా చేశారట డైరెక్టర్ అట్లీ.

కానీ ఇప్పటికే అల్లు అర్జున్ వరుస సినిమాలను ఒప్పుకోవడం.. వాటికే డేట్స్ అడ్జెస్ట్ చేయలేక పోతుండడంతో.. ప్రస్తుతానికి అయితే డైరెక్టర్ అట్లీని వెయిటింగ్ లిస్టులోనే పెట్టారట.





























