
సౌత్ నుంచి బాలీవుడ్‌కి వెళ్లిన సమంత, రష్మిక లాంటివాళ్లు మంచి క్రేజ్ అందుకున్నారు. వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ఇప్పుడు సాయిపల్లవి, శ్రీలీల, సంయుక్త వంతు వచ్చింది. ఇప్పుడు అందరి చూపు వీరిపై ఉంది.

నెక్స్ట్ వెండితెరమీదున్న రామకథలేంటని ఆరా తీస్తే.. చటుక్కున నార్త్ రామాయణాన్ని గుర్తుచేసుకుంటున్నారు జనాలు. సీతమ్మ తల్లి పాత్రలో సాయిపల్లవి ఎలా నటిస్తారో చూడాలని వెయిట్ చేస్తున్నారు.

ఆ మాటకొస్తే జస్ట్ జానకీదేవి కేరక్టర్ కోసమే కాదు.. ఉత్తరాదిన సాయిపల్లవి ఎలా ప్రూవ్ చేసుకుంటారో చూడాలనే క్యూరియాసిటీ కూడా కనిపిస్తోంది జనాల్లో. సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ తెలుగు, తమిళం, మాలయంలో స్టార్ హీరోయిన్ అయింది.

నార్త్‌లో షూట్ కంప్లీట్ చేసుకుని వెళ్తున్న శ్రీలీలకు ఇబ్బంది కలిగింది. జనాల్లో ఉన్న ఓ ఆకతాయి ఆమె చెయ్యి పట్టుకుని లాగడంతో ఇబ్బందిపడ్డారు శ్రీలీల. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ క్లిప్ చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. సరైన హిట్‌తో నార్త్‌లో ప్రూవ్ చేసుకుని చూపిస్తామంటున్నారు.

ఆల్రెడీ సౌత్‌లో ప్రూవ్ చేసుకున్న సంయుక్త మీనన్ కూడా నార్త్‌లో టాలెంట్ టెస్టుకు రెడీ అయ్యారు. హిందీలో ఒక్క హిట్ పడితే, కమర్షియల్ ప్లస్ పెర్ఫార్మెన్సు రోల్స్‌కి పర్ఫెక్ట్గా సరిపోయే మరో నటి బాలీవుడ్‌కి దొరికినట్టే అని ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.