- Telugu News Photo Gallery Cinema photos Heroine Samantha Ruth prabhu Photoshoot goes trending in Black Dress in citadel movie promotions
Samantha: నేనంటూ ఏదైనా చేస్తే.. నాలా ఇంకెవరూ చేయకూడదు అని గట్టిగా ఫిక్సయిన సమంత.!
నేనంటూ ఏదైనా చేస్తే, నాలాగా ఇంకెవరూ చేయకూడదు అని గట్టిగా ఫిక్సయినట్టున్నారు సామ్. అందుకే ఆమె ఏం చేసినా యూనిక్‌గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంతకీ సామ్ ఇప్పుడు అంతలా ఏం చేస్తున్నారు? చేయాల్సిన అవసరం ఏం వచ్చింది.? ఫ్యామిలీమేన్2లో సామ్ యాక్ట్ చేసినప్పుడు వారెవా ఏం పెర్ఫార్మెన్స్ అని అందరూ నోరెళ్లబెట్టారు. డిజిటల్‌లో ఆ రేంజ్‌లో దుమ్మురేపారు సామ్.
Updated on: Nov 11, 2024 | 8:39 PM

హాలీవుడ్ మేకర్స్ రుస్సో బ్రదర్స్ నిర్మించిన ఈ షోకు ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు.

దాదాపు 200 దేశాల్లో ఈ షో ట్రెండింగ్‌లో ఉన్నట్టుగా వెల్లడించారు మేకర్స్. పూర్తిగా ఇండియన్ స్టైల్ యాక్షన్, ఎమోషన్స్‌తో తెరకెక్కిన సిటాడెల్‌కు ఈ రేంజ్ రెస్పార్స్ రావటంతో మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

డిజిటల్‌లో ఆ రేంజ్‌లో దుమ్మురేపారు సామ్. ఇప్పుడు రాజ్ అండ్ డీకేతో ఆమె సిటాడెల్ చేశారు. ఓటీటీలో రిలీజ్‌కి రెడీ అంటున్న సిటాడెల్ ప్రమోషన్ల విషయంలోనూ తగ్గేదేలే అంటున్నారు సామ్.

సిటాడెల్ ప్రమోషన్లలో భాగంగా వరుణ్‌ధావన్‌తో కలిసి హాట్ హాట్ ఫొటోలకు ఫోజులిచ్చారు ఈ బ్యూటీ. ఈ ఫొటోలు ఇన్‌స్టంట్‌గా వైరల్ అవుతున్నాయి.

అసలే బాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్నప్పుడు ఈ మాత్రం గ్లామర్ షో తప్పదులే అని అంటున్నారు ముంబైవాలాస్.

అప్పట్లో ఫ్యామిలీమేన్2 క్లిక్ అయినట్టుగానే ఇప్పుడు సిటాడెల్ హిట్ కావాలి. అంతే కాదు, ఆల్రెడీ ఇదే థీమ్‌తో చేసిన ప్రియాంక చోప్రాని మ్యాచ్ చేయగలగాలి.

అప్పుడే బాలీవుడ్‌లో మరింత బజ్, ఫేమ్ వస్తుందన్న విషయం సామ్‌కి బాగా తెలుసు. అందుకే, సిటాడెల్ విషయంలో ఎక్కడా రాజీపడదలచుకోలేదు ఈ బ్యూటీ.




